telugu cinema reviews in telugu language

శ్రీకారం రివ్యూ – శ్రీకారం ఆయేనా ?

Srikaram movie review : మళ్లీ మళ్లీ ఇది రానీరోజు’, ‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’, ‘పడిపడి లేచే మనసు’, ‘జాను’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శర్వానంద్..ఈ ఏడాది ” శ్రీకారం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం నేడు మహాశివరాత్రి సందర్భంగా విడుదల అయింది. ఇప్పటికే శర్వానంద్ కి ఫ్యామిలీ హీరో గా ఇమేజ్ ఉండడంతో.. శ్రీకారం చిత్రంపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. నేడు విడుదలైన ఈ చిత్రం హిట్టా? ఫట్టా అనేది తెలుసుకుందాం..

యువత వ్యవసాయం లోకి రావాలనే మెయిన్ కాన్సెప్టుతో చిత్రాన్ని నిర్మించారు. శర్వానంద్ కి జోడిగా గ్యాంగ్ లీడర్ ఫేం హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించారు.ఈ చిత్రాన్నికి కిషోర్.బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట చిత్రాన్ని నిర్మించారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) సాఫ్ట్ వేర్ జాబ్ వదిలిపెట్టి వ్యవసాయం చేయడానికి తన ఊరికి వస్తాడు. యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అసలు రైతు గా ఎలా మారాడు.. అలా మారడానికి ఏ పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేదే కథ. సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా .. సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంది..

ఎప్పట్లానే శర్వానంద్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే రావు రమేష్ డైలాగ్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.ఓవర్ ఆల్ గా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం ఖాయం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button