Today Telugu News Updates
విప్రో నిర్ణయం పై సంతృప్తి పడుతున్న ఉద్యోగులు !

ప్రపంచ దేశాలు కరోనా కారణంగా work from home బాట పట్టిన విషయం తెల్సిందే, ఐతే భారత దేశం లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఆఫీస్ లకి వచ్చి విధులు నిర్వర్తించాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటె మరికొన్ని కంపెనీలు work from home ని కొనసాగించాలని భావిస్తున్నాయి. ఈ జాబితాలో విప్రో కూడా చేరింది. భారత్ మరియు అమెరికాలో ఉన్న ఉద్యోగులు జనవరి 18,2021 వరకు work from home ద్వారానే విధులను నిర్వర్తించాలని విప్రో వెల్లడించింది.
ఈ నిర్ణయం పై విప్రో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేసున్నారు. భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరగడంవల్ల ఉద్యోగుల భద్రత విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.