Today Telugu News Updates

విపక్షాల పై సీఎం కేసిఆర్ హాట్ కామెట్స్

విపక్షాల పై సీఎం కేసిఆర్ హాట్ కామెట్స్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరిగానే టిఆర్ఎస్ ఘన విజయం సాధించ బోతున్నదని , వంద సీట్లు సాధించి తీరుతుందని టిఆర్ ఎస్ అధ్యక్షులు , ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధీ మా వ్యక్తం చేశారు . అన్ని సర్వేలు అదే చెబుతున్నాయ న్నారు . దేశ రాజకీయాల్లో టిఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని , ఒక చోదక శక్తిగా పని చేస్తుందన్నారు . సిఎం కెసిఆర్ అధ్యక్ష తన టిఆర్ఎస్ లోకసభ , రాజ్యసభ , శాసనసభ , శాసనమండలి , జిహెచ్ఎంసి డివిజన్ ఇన్చా Ⅳ సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో బుధవా రం జరిగింది .

ఈ సందర్భంగా కెసిఆర్ గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపైన దిశానిర్దేశం చేశారు . తొ లుత మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డికి నివాళి అ ర్పించారు . ఈ సందర్భంగా సిఎం నాయినితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు . దిక్కుమాలిన , సంకుచిత ఆలోచనలతో దేశాన్ని నడిపే శక్తుల నుంచి ప్రజల ను కాపాడే బాధ్యత టిఆర్ఎస్ పైనా , తెలంగాణ రాష్ట్రంపై నా ఉందన్నారు . బిజెపి , కాంగ్రెస్ దొందూ దొందే అన్న ట్టుగా ఉన్నాయని , ఈ రెండు మూస పార్టీల నుంచి దేశా నికి విముక్తి కావాలని , దేశం నూతన మార్గం పట్టాల న్నారు . ప్రపంచ యువకుల్లో 40 శాతం మంది భారతదే శంలోనే ఉన్నారని , అనేక వనరులున్న మన దేశానికి మంచి దిశానిర్దేశం , మంచి నాయకత్వం కావాలని ఆ కాంక్షించారు . టిఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదని , టిఆ ④ను చాలా సార్లు తక్కువ చేసి మాట్లాడారని , ఒక స మయంలో టిఆర్ ఎస్ పని అయిపోయిందని కూడా ప్ర చారం చేశారని , అలాంటి సమయాల్లో టిఆర్ఎస్ లేచి దెబ్బకొడితే నషాళాన్ని అంటిందని చెప్పారు .

ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా ?, అగ్గిమండే హైదరాబాద్ కావాలా : కెసిఆర్ ‘ ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా ?, అగ్గిమండే హైద రాబాద్ కావాలా ?, మత కల్లోలాల హైదరాబాద్ కావా లా ? మత సామరస్యం వెల్లివిరిసే హైదరాబాద్ కావాలా ? మతం పేర కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కా వాలా ? అందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉండే హైదరాబాద్ కావాలా ? హైదరాబాద్ నగరంలో అభి వృద్ది కావాలా ? అశాంతి రాజ్యమేలాలా ? ప్రజలు ఆలో చించుకోవాలి ” అని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు . మా య మాటలకు , తప్పుడు ప్రచారానికి హైదరాబాద్ నగర ప్రజలు పడిపోయే వాళ్లు కాదని , తప్పక నిజాలు గ్రహి స్తారని , తప్పుడు ప్రచారాలతో అబద్ధాలను నిజంగా భ్ర మింప చేయాలని బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించా రు . వీటిని టిఆర్ఎస్ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు .

విపక్షాల పై సీఎం కేసిఆర్ హాట్ కామెట్స్ ::

‘ వరద సాయం ‘ అడ్డుకున్న బిజెపి : సిఎం గ్రేటర్ హైదరాబాదు , పేదలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రూ .10 వేల ‘ వరద సాయం’ను అడ్డుకుంటున్నదని ము ఖ్యమంత్రి కెసిఆర్ ఆరోపించారు . హైదరాబాద్ లో పేద లకు ఆర్థిక సాయం నిలిపి వేయాలని ఎన్నికల సంఘాని కి బిజెపి ఫిర్యాదు చేసిందని , పేదల నోటి కాడి బుక్కలాక్కుంటున్నదని , చిల్లర రాజకీయాలు చేస్తున్నదని , దీనిని నగర ప్రజలు గమనించాలని కోరారు . బిజెపి ఎంతటి నీచమైన ప్రచారానికైనా ఒడిగడుతుందన్నారు . ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలతో దెబ్బతిన్న హైదరాబా దు , ఇబ్బంది పడిన ప్రజల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని , కానీ బూ రద రాజకీయం చేస్తోందని ఆరోపించారు .

గ్రేటర్ హైద రాబాద్ లో ఇప్పటికే 6.78 లక్షల మందికి ‘ వరద సా యం ‘ అందిందని , ఇంకా ఎంత మంది బాధితులు ఉం టే అంతమందికి సాయం అందుతుందని స్పష్టం చేశా రు . దుబ్బాక ఎన్నికల్లో బిజెపి చేయని దుష్ప్రచారం , ఆడ ని అబద్ధం లేదని పేర్కొన్నారు . టిఆర్ఎస్ అభ్యర్థి పోలిం గ్ బూతులోనికి వెళ్లి , బ్యాలెట్ పేపర్ పైన మంత్రి హరీశ్ రావు ఫోటోలేదని అడిగినట్లు సోషల్ మీడియాలో ప్రచా రం కూడా చేశారని , తమ అభ్యర్థిని ఆ గౌరవ పరుస్తూ పోస్టింగులు పెట్టారని , ఇంత దుర్మార్గం ఉంటుందా , ఇంత నీచమైన ప్రచారం చేస్తరా ? అని ప్రశ్నించారు . జి హెచ్ ఎంసి ఎన్నికల్లో కూడా ఇలాంటి దారుణాలే చేయాలని చూస్తున్నారని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button