Tollywood news in telugu

విద్యార్థులను ముంచిన కిలాడీ జంట H 1B వీసాల పేరుతో మోసం

విదేశాల్లో పై చదువులో చదువుతున్న విద్యార్థులకు.
హెచ్ 1బి వీసాలు ఇప్పిస్తామని పలువురు నమ్మబలికి కోట్లు స్వాహా చేస్తున్నారు .. అలాంటి ఘటనే మన తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంది… వీసా ఇప్పిస్తానని ఓ నకిలీ జంట అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల నుండి 10 కోట్ల ను వసూలు చేసి …ఆ డబ్బు తో సహా చెకేశారు…

పూర్తి వివరాల్లోకి వెళితే…ముత్యాల సునీల్, ప్రణీత జంట కలిసి అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థులకు హెచ్1బీ వీసాల ఇప్పిస్తామని ..కన్సల్టెంట్ కంపెనీ పేరుతో 30 విద్యార్థుల నుండి 10 కోట్లు వసూలు చేశారు.. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు కనపడకపోయేసరికి విద్యార్థులు తాము మోసపోయామని నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు… దీంతో ఆ నకిలీ జంట పరారయ్యారు..సునీల్ తను విద్యార్థుల నుండి వసూలు చేసిన డబ్బును తన తండ్రి అయిన ముత్యాల సత్యనారాయణ ఎకౌంటు కు బదిలీ చేసేవాడు… ఈ క్రమంలో పోలీసులు సత్యనారాయణను కూడా వెతకడం మొదలుపెట్టారు..ఆయన కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం

Leave a Reply

Your email address will not be published.

Back to top button