విద్యార్థులకు మద్దతుగా … సోనూసూద్

దేశంలో నీట్, జేఈఈ పరీక్షలకు కేంద్ర విద్యాశాఖ అనుమతులిచ్చింది. ఇపుడు దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలు వాయిదా వేయాలని, లాక్డౌన్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని, విద్యార్థులు మానసికంగా సిద్ధంగా లేరని కేంద్రాన్ని కోరుతున్నారు.
నీట్, జేఈఈ పరీక్షలకు 26 లక్షల మంది హాజరుకానున్నారు. బీహార్ లోని దాదాపు 13 నుంచి 14 జిల్లాలు వరదల వల్ల ఎంతో నష్టం వాటిల్లిందని ,సరియైన వసతిలేక ఇబ్బంది పడుతున్నారని ,కానీ ఆ రాష్ట్రం నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారు కూడా పరీక్షలకు సిద్ధంగా లేరని ప్రజలు వాపోయారు.
విద్యార్థులకు,తల్లిదండులకు మద్ధతుగా సోనూసూద్ ఈ టైంలో వారిని పరీక్షలు రాయమనడం కరెక్ట్ కాదు, వారికి రెండు నెలల సమయం ఇవ్వండి. పరీక్షలను నవంబర్ లేదా డిసెంబర్ వరకు వాయిదా వేయాలని మద్దతు పలికాడు.
విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ ‘తల్లిదండ్రులు మరియు విద్యార్థుల నుండి ఒత్తిడి రావడంతోనే మేము జేఈఈ, నీట్ లను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని మీడియాకు తెలిపారు.