వారం రోజుల తర్వాత లైంగిక బాధితురాలి మాటలపై స్పందించిన:-హీరో కృష్ణుడు

సెట్టిపాలెం గ్రామానికి చెందిన ఒక యువతి తనపై 139 మంది కొన్నేళ్లుగా లైంగిక దాడికి చేసారని ,వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ నెల 21న హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులలో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు, కొంత మంది జర్నలిస్టులు, విద్యార్థి సంఘం నాయకుల పేర్లు ఉన్నాయి.
ఇప్పటికే యాంకర్ ప్రదీప్ మీడియా ముందు తన ఆవేదనను చెప్పుకున్నాడు. కానీ కృష్ణుకు మాతరం వారం రోజులు గడచినా తర్వాత మీడియా ముందుకువచ్చి నాకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తనపై చేసిన ఆరోపణలను కృష్ణుడు ఖండించాడు.
ఒకరిపై ఆరోపణలు చేసే ముందు వారి కుటుంబం ఉంటుందని ఆలోచించాలి. ఆరోపణలు రాగానే ఆ విషయాన్ని నా భార్యకు చెప్పాను,నా భార్య నాకు దైర్యం చెప్పింది.
నేను మహిళలకు ఎంత గౌరవం ఇస్తానో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కృష్ణుడు మీడియాకు వెల్లడించాడు.