లివర్‌లో ఏదైనా అనారోగ్య సమస్య ఉందని ఇలా తెలుసుకోండి
మానవ శరీరంలో ఉండే అతి పెద్ద అవయవమైన లివర్ ఎన్నో పనులను సక్రమంగా నిర్వర్తిస్తుంది. లివర్ యొక్క పనితీరు మెరుగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మనము తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను గ్రహించి శరీరానికి అందించే ముఖ్యమైన బాధ్యత లివర్‌దే. ఇలా ఎన్నో పనులు చేసే లివర్‌కు ఏమైన సమస్య వచ్చిందంటే అది ఆరోగ్యము పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. అయితే లివర్ ప్రమాదంతో పడుతుందన్న విషయాన్ని కొన్ని ముందుస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అవి ఏమంటే.
లివర్‌లో ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ముందస్తుగా మనకి కనిపించే ఒక లక్షణం పొట్ట ఉబ్బడం. లివర్ పనితీరు సరిగా లేకుంటే కడుపు ఉబ్బరం గా ఉన్నట్లు అనిపిస్తుంది. గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఇక లివర్ గాని చెడిపోయిందంటే కొందరిలో కడుపునొప్పి ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. కుడివైపు ఉన్న ఊపిరితిత్తుల కింది భాగంలో నొప్పి ఎక్కువగా ఉండటం . కొందరికి విరోచనాలు కూడా అవుతుంటాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.
దీర్ఘ కాలంగా అజీర్ణతతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందువల్ల అంటే ఆహారం జీర్ణం కావడంలో లివర్ పాత్ర నే కీలకం. లివర్ దెబ్బతింటే ముందుగా ప్రభావం పడేది జీర్ణ వ్యవస్థమీదే అని గుర్తించాలి.
ఇంకా కొందరిలో లివర్ పాడైందంటే చర్మం పైన దురదలు, వాపులు వస్తాయి. కొన్ని సార్లు ఇది చర్మ సంబంధిత సమస్యే అయినప్పటికీ లివర్ పనితీరు పాడవడం వలన కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు.
లివర్ సమస్యతో ఉండేవాళ్ళలో కాళ్ల వాపు కూడా ఉంటుంది. వాపు ఉన్న ప్రదేశంలో నొక్కితే గుంటలా ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇట్టి సమస్య ఉంటే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.
లివర్ పాడైన వారిలో కనిపించే లక్షణాల్లో శరీరం పసుపు రంగులోకి మారడం కుడా ఒకటి. చర్మంతో పాటుగా కళ్లు పసుపు రంగులోకి మారుతాయి . కావున ఇలాంటి మార్పులు కనబడగానే వెంటనే అలర్ట్ అవ్వాలి.