రేవంత్ రెడ్డికి టిపిసిసి ఇస్తే..నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా: పిహెచ్

రేవంత్ రెడ్డికి టిపిసిసి పదవి ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తను ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని గుర్తు చేశారు. అలాగే 2018 నుంచి సోనియాగాంధీ ని కలుద్దాం అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్ని, అదే విధంగా రాహుల్ గాంధీని కలుద్దాం అంటే కాంగ్రెస్ నాయకులు కలుసుకోనివ్వట్లేదని మండిపడ్డారు. తన గురించి కొందరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానన్ని కి తప్పుడు ప్రచారం అందించారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ప్యాకేజీ లకు అమ్ముడుపోయి.. కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు నివేదిక చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్ వానికి టీపీసీసీ పదవి కట్టబెడితే..తను..తనతో పాటు కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడుతారని వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు