Today Telugu News Updates

రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టివేత

రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టివేత గత కొద్ది సంవత్స రాలనుండి జిల్లా మీదుగా జరుగుతున్న గంజాయి రవాణాలో జూలూరుపాడు మండలానికి చెందిన యువకులు ఎక్కువగా పట్టుబడుతుండడం గమ నార్హం . తెలంగాణ రాష్ట్రానికి పొరుగున్న ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువగా అటవీ ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా గంజాయి సాగును చేస్తున్నట్లు తెలిసింది . అక్కడనుండి వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా దారులు వివిధ రకాల వాహనాలలో చేరవేస్తుంటారు . గంజాయి ( నార్కోటిక్ డ్రగ్స్ జాబితాలో ఉండడం ) నిషేధించబడిన వస్తువుల జాబితాలో ఉంది . దీనిని సేవించిన వ్యక్తులు ఓ రకమైన మత్తుకు అలవాటుపడి దానికి బానిసలుగా మారి తమ జీవితాలను బలి చేసుకుంటున్న నేపధ్యంలో ప్రభుత్వాలు దీనిని నిషేధించాయి .

గంజాయి సాగు చేసినా , సేవించినా , రవాణా చేసినా కఠిన శిక్షలకు గురికావలసి ఉంటుది . అయినా కూడా గంజాయి రవాణాలో ముఖ్యంగా యువకులు చురుకుగా పాల్గొనడం విస్మయం కలిగిస్తోంది . గడచిన ఏడాది క్రితం పాపకొల్లుకు చెందిన వ్యక్తులు చింతూరు వద్ద పెద్దమొత్తంలో దొరికిన గంజాయి రవాణాలో పట్టుబడ్డారు . అప్పుడు ఈ వార్త ఈ ప్రాంతంలోనే కాక రాష్ట్రంలో సంచల నంగా మారింది . అనంతరం గుట్టుగా గంజాయి వ్యాపారం నడుస్తున్నప్పటికీ దొరికితేనే దొంగ లుగా తేలుతున్నారు . చింతూరు సంఘటన అనం తరం బూర్గుంపాటు పోలీస్ పరిధిలో మండలం లోని గుండెపుడి , గ్రామానికి చెందిన వ్యక్తులు గంజాయి రవణా చేస్తూ పట్టుబడ్డారు . అనం తరం ఇప్పుడు తిరుమలాయపాలెం పోలీసులు నిర్వహించిన తనీఖీలలో మండల పరధిలోని గురవాగుతండా గ్రామానికి చెందిన హలావత్ శివ , భూక్యా కిషన్లు ఓ ఖరీదైన కారులో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు .

రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టివేత ::

ఈజీ మనీకి అలవాటు పడుతున్న యువతః కష్ట పడకుండా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గంగా గంజాయి రవాణా మార్గాన్ని యువకులు అలవా టుగా చేసుకున్నట్లు తెలుస్తోంది . కొంచెం తెలి వితో వ్యవహరించి వాహనాలద్వారా గంజాయిని స్మగ్లర్లు సూచించిన ప్రదేశానికి చేరిస్తే చాలు వేలాది రూపాయలు కమీషన్‌గా ముడుతుండ డంతో యువకులు గంజాయి రవాణాకు ఆకర్శి తులవుతున్నట్లు తెలిసింది . వచ్చిన డబ్బుతో ఖరీ దైన బైకు కార్లు కొనుగోలు చేసి జల్సాలకు అల వాటు పడుతున్నారు . మరికొందరైతే డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా గంజాయి రవా ణాకు అలవాటు పడుతున్నారు . ముఖ్యంగా గుండెపుడి , పాపకొల్లు , కొమ్ముగూడెం , గురవా గుతండా తదితర ప్రాంతాలకు చెందిన యువ కులే కాకుండా , ఈ రవాణాకు ఇతర గ్రామాలకు చెందిన యువకులు కూడా ఆకర్షితులవుతు న్నట్లు తెలిసింది .

కానీ కొద్దీగొప్పో చదువుకున్న వారు కూడా ఈ కేసులలో ఇరుక్కుంటూ తమ భవిష్యత్ ను బలిచేసుకుంటున్నారనేది వాస్తవం . ఈ కేసులలో గంజాయి రవాణా పరిమాణాన్ని బట్టి బెయిల్ మంజూరవుతోందని తెలుస్తోంది . ఎక్కువ పరిమాణంలో పట్టుబడితే బెయిల్ రావడం ఆలస్యమవుతున్నట్లు లేదా బెయిల్ సాధారణంగానే మంజూరవుతన్నట్లు న్యాయ నిపుణులు చెపుతున్నారు . ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పట్టుబడితే వారికి ఇక్కడ షూరి టీలు దొరకక వారు జైలులోనే గడుపుతున్నట్లు తెలుస్తోంది . స్వరాష్ట్రాలలో కేసులున్న వ్యక్తులు త్వరగానే బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది . ఇది ఎక్కువగా గుట్టుగా సాగుతున్న వ్యవహారం కనుకు కొత్త వ్యక్తులు ఈ వ్యాపారంలో త్వరగా చేరలేరనేది గమనార్హం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button