రామ మందిర నిర్మాణ ప్రారంభంలో పాల్గొన్న నరేంద్రమోడీ :-

ప్రధాని నరేంద్రమోడీ రామ మందిర నిర్మాణ ప్రారంభానికి అయోధ్య లో ముందుగా ఆంజనేయ స్వామి సన్నిధి కి వెళ్లి , తరవాత రామ మందిరానికి భూమి పూజ నిర్వహించాడు ,అక్కడ ఏర్పాటు చేసిన శీలా ఫలకాన్ని ప్రారంభించారు .
ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించుకోదగ్గ విషయం అని చెప్పారు . రామ మందిర నిర్మాణ పూజలో పాల్గొనే అవకాశం రావడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను , ఈ రోజు వందల ఏళ్ళ నిరీక్షణ ,ఈ రోజు దేశం లోని ప్రజల కల నెరవేరిందని భావిస్తున్నాను .
ఈ రామ మందిర నిర్మాణానికి ఎంతో మంది త్యాగాలు చేసారు ,వారి త్యాగాల తోనే ఈ రోజు రామ మందిర నిర్మాణం చేయగలిగాము,భారత జీవన విధానంలోను ఆదేవిందంగా మహాత్ముడి నినాదం లోను ఆ శ్రీరాముడు ఉన్నాడు అని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసాడు .అలాగే అయోధ్య యొక్క ఆర్థిక పరిస్థితి ఈ రామ మందిర ఆలయ నిర్మాణం తో మెరుగు పడుతుందని తెలిపాడు .