Today Telugu News UpdatesTollywood news in telugu

రణరంగంగా మారిన ఢిల్లీ బోర్డర్

రణరంగంగా మారిన ఢిల్లీ బోర్డర్ కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు చేపట్టిన “ ఢిల్లీ ఛలో ” నిరసన యాత్ర ఉద్రిక్తంగా మారింది . బారికేడ్లను ధ్వంసం చేసి మరీ హర్యా నాలోకి ప్రవేశించాలని ప్రయత్నించడంతో పోలీ సులు జల ఫిరంగులు , బాష్పవాయుగోళాల ప్రయోగానికి దిగారు . దాంతో హర్యానా , పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న శంభు దగ్గర గురు వారం నాడు ఉద్రిక్తత రాజ్యమేలింది . ఘగ్గర్ నది మీదున్న వంతెన దగ్గర రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఆ ప్రాంతంలో నల్ల జెండాలు ధరించి నినాదాలు ఇస్తున్న వాళ్లు , ట్రాక్టర్లు , ట్రక్కుల బారు దర్శనమిచ్చింది .

పంజాబ్ వైపు నుంచి రైతులు సరిహద్దులు దాటొద్దని హర్యానా పోలీసులు లౌడ్ స్పీకర్ల ద్వారా విజ్ఞప్తి చేశారు . కానీ శంభు దగ్గర రైతులు బ్యారికేడ్లను బద్దలు కొట్టి మరీ అంతర్రాష్ట్ర సరిహద్దును దాటే ప్రయత్నం చేశారు . కొన్ని బ్యారికేడ్లను ఘగ్గర్ నదిలోకి విసిరివేశారు . శంభు సరిహద్దు ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది . “ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వాళ్ల మీద హర్యానా పోలీసులు దాడికి దిగడం గర్హనీ యమని , నిరసన చేసేందుకు మాకున్న ప్రజా స్వామ్య హక్కును ఆపేందుకు ప్రయత్నిస్తున్నా ర’ని ఒక రైతు విలేకర్లతో వాపోయాడు . పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్లే అన్ని మార్గాలనూ హర్యానా మూసివేసింది . అంబాలాలోని మోహో గ్రామంలో బారికేడ్లను దాటేందుకు ప్రయత్నిం చిన వారిమీద బుధవారం పోలీసులు జలఫిరం గులు ప్రయోగించారు .

రణరంగంగా మారిన ఢిల్లీ బోర్డర్

అంబాలా- కురుక్షేత్ర సరిహద్దుల్లోని తియోరా – తియోరీ గ్రామంలోకి ప్రవేశించిన మరో బృందం మీద కూడా పోలీ సులు జలఫిరంగులు ప్రయోగించారు . అయితే భారతీయ కిసాన్ యూనియన్ ( బికెయు ) రాష్ట్ర అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చురానీ నాయక త్వంలో రైతులు హర్యానాలోని కర్నాల్‌కు చేరుకు న్నారు . ఢిల్లీ ఛలో కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచు కొని నవంబర్ 26– 27 తేదీల్లో పంజాబ్ తో సరి హద్దులను మూసివేస్తున్నట్లు హర్యానాలో అధి కార బిజెపి ప్రభుత్వం ఇంతకుముందే చెప్పింది . కొవిడ్ -19 దృష్ట్యా రైతులు నిరసన చేపడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీ సులు కూడా హెచ్చరించారు . ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసులను మోహరించారు .

నిరసన లను అడ్డుకోవడానికి హర్యానా ప్రభుత్వం రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాల్లో 144 వ సెక్షన్ విధించింది . అయితే ఢిల్లీకి వెళ్లే మార్గంలో తమను అడ్డుకొన్న ప్రతీచోటా ధర్నాకు దిగుతామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి . యాత్రలో దాదాపు 25,000 మంది మహిళలు పాల్గొననున్నారని , దీనికోసం 4,000 ట్రాక్టర్లను ఏర్పాటుచేశామని భారతీయ కిసాన్ యూనియన్ ( ఏక్తా – ఉగార్డన్ ) నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ కోబ్రకలాన్ వెల్లడిం చారు . ఖనౌరీ , డబ్వాలీ నుంచి హర్యానాలోకి ప్రవేశించేందుకు 2 లక్షలకు పైగా రైతులు వేచి ఉన్నారని ఆయన అన్నారు . కేంద్రం చేసిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని పంజాబ్ రైతులు డిమాండ్ చేస్తున్నారు . వాటి స్థానంలో సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత వేరే చట్టాలను చేయాలని , కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని కోరుతున్నారు .

One Comment

  1. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి హిందువూ సమర్ధించి పాల్గొని ప్రోత్సహించి తరించాల్సిన సన్నివేశం ఒకటి భాగ్యనగరం నడిమధ్యన జరగబోతున్నది,అదే వాజపేయ సోమయాగం హైదరాబాద్ – భాగ్యనగరం – వాజపేయం – సోమయాగం – Those who are living in and around bhagyanagaram must attend in person!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button