Tollywood news in telugu
యాంకర్ రష్మీ కరోనా కోరల్లో చిక్కుకుంది…షూటింగ్స్ రద్దు.. పూర్తి వివరాలు !

rashmi anchor గత కొన్ని రోజుల నుండి జబర్దస్త్ టీమ్ కరోనా బారిన పడుతున్నట్టు షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతకముందు సుడిగాలి సుదీర్ కరోనాకు చిక్కారని వార్తలు వెలువడ్డాయి. ఈ విషయం పై సుదీర్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రజలు అతనికి కరోనా సోకిందని నిర్దారించుకున్నారు.
ఇపుడు తాజాగా రష్మీ కి కూడా కరోనా కోరల్లో చిక్కుకున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రష్మీ స్వల్ప అనారోగ్య లక్షణాలు వచ్చాయని. ఆమె కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నారని తనకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ నెల 23 మరియు 28 షూటింగ్ కి దూరంగా ఉండనున్నారని సమాచారం.
ఈ విషయం పై రష్మీ అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో షోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.