Today Telugu News Updates

మోడీ సర్కార్ కు గట్టి దెబ్బ

ప్రధాని నరేంద్రమోడీ గారూ ! ఆసేతు హిమాచలం భారత ప్రజల అసమ్మతి చెవికెక్కిందా ? అన్నదాతలైన రైతాంగాన్ని బికారులను చేసి మిత్ర కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే మూడు వ్యవసాయ మార్కెట్ సంస్కరణ చట్టాలను వెనక్కు తీసుకోండి ! ప్రతిష్టకు పీకులాడకుండా రైతు సంఘర్ష కమిటీ ప్రతినిధు లతో ఒప్పందం చేసుకోండి !! సుహృద్భావ వాతావరణం సృష్టించండి !! ఇదీ మంగళవారం రైతు సంఘాల పిలుపుపై అపూర్వంగా జరిగిన భారత్ బంద్ సందేశం . వందలాది ప్రజాసంఘాలు , కార్మిక సంఘాలు , 24 రాజకీయ పార్టీల నైతిక మద్దతు నభూతోనభవిష్యతి .

ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధి కారంలో ఉన్నదన్న దానితో నిమిత్తం లేకుండా ప్రజాసమూహాలు స్వచ్ఛం దంగా , శాంతియుతంగా బంద్ పాటించటం ప్రజా నిరసన కార్యాచరణల్లో కనీవినీ ఎరుగనిది . బిజెపి యేతర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మొక్కవోని పోరా టానికి సంఘీభావంగా బందను బలపరిచాయి . బిజెపి ప్రభుత్వాలు శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించినా ఆందోళనకారులు వారికి శ్రమ ఇవ్వలేదు . రైతుల ఆందోళన పంజాబ్ కే పరిమి తమంటూ , ప్రదర్శకులు రైతులు కాదు – ఖలిస్థానీవాదులంటూ అపూర్వమైన పోరాటాన్ని కించపరిచేందుకు , దానిపై దుష్ప్రచారం సాగించిన బిజెపి వారికి దేశ ప్రజలు చెంపపెట్టుపెట్టారు . బంద్ కు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రక టించటంతో ఇది రైతుల పోరాటం కాదు – ప్రతిపక్ష పార్టీల ప్రేరేప ఆందోళన అంటూ కేంద్రమంత్రులు తాజాగా నోరుపారేసుకున్నారు . ప్రజల రోజువారీ కార్యకలాపాలకు పెద్దగా అంతరాయం కలుగకుండా బందను 11-3 గంటల మధ్య నాలుగు గంటలకే పరిమితం చేయటం రైతు నాయకుల పరిణితికి నిద ర్శనం .

అంతేగాక రాజకీయ పార్టీలు తమ జెండాలతో పాల్గొనరాదని వారు చేసిన విజ్ఞప్తి రైతాంగ ఆందోళనకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకో జూసిన బిజెపి ఎత్తుగడను చిత్తు చేసింది . ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ బంద్ కు పిలుపు ఇవ్వకపోయినా ఆప్ కార్యకర్తలు రైతులతో దృఢంగా నిలబడ్డారు . మోడీ ప్రభుత్వంతో సయోధ్య నెరపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బందను బలపరిచారు . ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బందను బహిరంగంగా బలపరచకపోయినా యావత్ ఒడిసా మూతపడింది . పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బందన్ను అనుకూలించకపోయినా రైతులకు సంఘీభావం తెలిపారు . తెలంగాణలో టిఆర్ఎస్ బంద్ లో పాల్గొంది .

మోడీ సర్కార్ కు గట్టి దెబ్బ

ఆంధ్రప్రదేశ్ లో కూడా బస్సులు తిరగలేదు . దేశమంతటా రవాణా స్తంభించింది . బ్యాంకులు తెరిచినా లావాదేవీలు లేవు ; ఉద్యోగులు రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు . రైళ్లు నడిపే ప్రయత్నం చేసినా చాలాచోట్ల ఉద్యమకారులు ‘ రైల్ రోకో’తో అటకాయించారు . ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా దేశమంతటా ‘ చక్కా జామ్ ‘ ( రోడ్ల దిగ్బంధం ) జరిగిపోయింది . రైతులు మోడీ ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ‘ మా దారి రహదారి ‘ అని పోరాటం చేస్తున్నారు . సహజంగా బంద్ సందర్భంలో ఉండే గడబిడ లేకుండా ప్రశాంతంగా బంద్ ను విజయవంతం చేసిన శ్రమవీరులకు జేజేలు చెబుదాం ! కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లుగాక !!

కోవిడ్ -19 కాలంలో ప్రజల ఆందోళనలను నిషేధించిన మోడీ ప్రభుత్వం , ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని కార్మిక , రైతు , ప్రజావ్యతిరేక చట్టాలు చేయటం ప్రజాస్వామికమా ? కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా మార్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ , రాజ్యాంగం , లౌకిక వ్యవస్థ రక్షణ కొరకు నవంబర్ 26 న 10 కేంద్ర ట్రేడ్ యూనియన్లు , అతిపెద్ద స్వతంత్ర ఫెడరేష న్లు , అసోసియేషన్ పిలుపుపై కార్మిక , ఉద్యోగ తరగతులు విజయవం తంగా సమ్మె చేయటం ఈ సందర్భంగా గుర్తు చేసుకోదగింది . రైతాంగ వినా శక తాజా చట్టాలకు వ్యతిరేకంగా రెండు మాసాలుగా వివిధ రూపాల్లో ఆందో శన సాగిస్తున్న దాదాపు 500 రైతు సంఘాలతో కూడిన అఖిల భారత కిసాన్ సంఘ సమన్వయ కమిటీ నిర్ణయంతో అదే 26 వ తేదీన రైతాంగం ‘ చలో ఢిల్లీ ‘ అంటూ తీవ్రమైన చలిని లెక్కచేయకుండా ట్రాక్టర్లే ఆవాసాలుగా ఢిల్లీ బయలుదేరారు . వారిని అటకాయించేందుకు బిజెపి ప్రభుత్వాలు సాగించిన దమనకాండ వారి సంకల్పబలం ముందు ఓడిపోయింది .

చివరకు ఢిల్లీ నగరం వెలుపల నిరంకారీ గ్రౌండకు అనుమతించటమే కుట్ర . దాన్ని బహిరంగ జైలుగా భావించిన రైతులు ఆ ఉచ్చులో చిక్కుకోకుండా ఢిల్లీకి చేరుకునే రహదా రులను నాలుగు వైపులా దిగ్బంధించారు . వారి శాంతియుత నిరసన మోడీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది . చర్చల నాటకానికి తెరతీసింది . రైతు సంఘాల ప్రతినిధులు చర్చల సందర్భంలో ప్రభుత్వ ఆహారాన్ని , తేనీరును కూడా తిరస్కరించి తమ సొంత ఏర్పాట్లు చేసుకోవటం ఈ ప్రభుత్వం పట్ల రైతాంగం విశ్వాసరాహిత్యానికి నిదర్శనం . అంశాలవారీ చట్టాలపై చర్చ అంటూ ప్రభుత్వ ప్రతినిధులు అనుసరిస్తున్న సాగతీతను వారు కరాఖండీగా తిప్పికొడుతూ – ఎస్ లేదా నో ( చట్టాలను రద్దు చేస్తారా , లేదా ) ఏదో ఒకటి చెప్పండని భీష్మించుకున్నారు . కాబట్టి రేపు ( 9 వ తేదీ ) జరిగే చర్చలనుండి ఫలి తాన్ని ఆశించలేము . ఎందుకంటే ఆ రైతు వ్యతిరేక చట్టాలను ప్రధానమంత్రి మొదలు ఇతర మంత్రులు నిత్యం గట్టిగా సమర్థిస్తున్నారు . అందువల్ల రైతు నాయకులు ప్రకటించినట్లు దీర్ఘకాల పోరాటం అనివార్యం కావచ్చు . భారత్ బంద్ కు లభించిన కనీవినీ ఎరుగని విస్తృత తోడ్పాటు ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగిస్తుందో లేదో వేచి చూదాం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button