movie reviews

మూవీ రివ్యూ : ఓటర్

చిత్రం: ఓటర్
ఆర్టిస్ట్స్ : మంచు విష్ణు , సురభి , పోసాని , సంపత్ రాజ్ తదితరులు
డైరెక్టర్ : జి .ఎస్ . కార్తీక్ రెడ్డి
ప్రొడ్యూసర్ : జాన్ సుధీర్ పూదోట
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ తనమల
రిలీజ్ : సార్థక్ మూవీస్ ప్రశాంత్ గౌడ్
సంగీతం : థమన్
కెమెరామెన్ : రాజేష్ యాదవ్
ఆర్ట్ డైరెక్టర్: ఎమ్ .కిరణ్ కుమార్
ఎడిటర్ :కె.ఎల్ .ప్రవీణ్

కథ :

మంచు విష్ణు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు . తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇండియా వస్తాడు , క్రమంలో హీరోయిన్ సురభి పరిచయం అవుతుంది . అలా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది . అనుకోని కారణాలవల్ల హీరోయిన్ కొన్ని కండిషన్స్ పెడుతుంది . హీరో ఆ కండిషన్స్ ను ఛాలెంజ్ గ తీసుకుంటాడు . ఈ క్రమంలో ఒక రాజకీయ నాయకుడితో హీరో తలపడాల్సి వస్తుంది . ఆ రాజకీయ నాయకుడు చేసే అరాచకాలను ఎదిరిస్తాడు హీరో, చివరికి ఏమయ్యింది ? హీరోయిన్ పెట్టిన కండిషన్స్ ఏంటి ? చివరికి హీరోయిన్ ప్రేమను హీరో ఎలా గెలిచాడు వంటి అంశాలు తెలియాలంటే ఓటర్ చిత్రం చూడాల్సిందే .

విశ్లేషణ :

ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై జాన్‌సుధీర్ పూదోట నిర్మించిన సినిమా ఓటర్ . గతంలో రామా రీల్స్ షో టైం , నరుడా డోనరుడా చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం ఈ బ్యానర్ పలు చిత్రాలను నిర్మిస్తోంది . ప్రశాంత్ గౌడ్ ఓటర్ చిత్రాన్ని ఎన్నో సమస్యల నుండి బయటికే పడేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు . సార్థక్ మూవీస్ ద్వారా ఈ చిత్రం విడుదల అయ్యింది . మంచు విష్ణు, సురభి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాను కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించారు . తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది . పోసాని కృష్ణ మురళి నటన ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది . ప్రధానంగా రీ కాల్ అనే కాన్సెప్ట్ సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పుకోవాలి .

“అసెంబ్లీ రౌడీ” సినిమాలోని సీన్లు, స్క్రీన్ ప్లే వాడుకున్నారు అంటూ ఈ మధ్య “ఓటర్” చిత్ర వివాదం మీడియాలో కాస్త హల్ చల్ చేసింది. అయితే నిజానికి “ఓటర్” లో ఆ ఛాయలు మచ్చుకైనా కనపడలేదు. స్క్రీన్ ప్లే వరకూ ఎందుకు.. కనీసం ఒక్క సీన్ లో కూడా “అసెంబ్లీ రౌడీ” పోలికలు కానరాలేదు. మరి ఏమి లేని దానికి ఇంత వివాదం ఎందుకు రేగిందో ఆ చిత్ర వర్గాలకే తెలియాలి. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది . దర్శకుడు కార్తీక్ రెడ్డి సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది .

తమన్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ అని చెప్పుకోవచ్చు . ఒక రాజకీయనాయకుడిని ఎదురించే పాత్రలో మంచు విషు నటించడం జరిగింది . దర్శకుడు హీరో, విలన్ మధ్య వచ్చే సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించడం జరిగింది . నిర్మాత జాన్‌సుధీర్ పూదోట సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు . నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు కార్తీక్‌పై 24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ సినిమాని ఆపాలంటూ వేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. సినిమా విడుదల విషయంలో అభ్యంతరం చెప్పకుండా కోర్టు ఆర్డర్‌ కూడా ఇచ్చింది . అందుచేత ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది . మాస్ ఆడియన్స్ కు కావాల్సిన అన్ని అంశాలతో పాటు చక్కటి సందేశం ఈ సినిమాలో ఉండడంతో సినిమా ఆలోచింపజేస్తుంది .

వినోదంతో పాటు సందేశం ఉన్న ఈ సినిమాను కుటుంభ సమేతంగా చూడవచ్చు . ఓటర్ మెప్పిస్తాడనడంలో సందేహం లేదు .

చివరిగా : ఓటర్ ఆలోచింపజేస్తాడు

రేటింగ్ : 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button