మీ నాలుక రంగు ని బట్టి ఆరోగ్య సమస్యలు ఇలా తెలుసుకోండి
Tongue Says About Your Health? మనకు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ముందుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అక్కడ డాక్టర్ ఏ ట్రీట్మెంట్ కైన ముందు మనల్ని నాలుక తెరవండి అని / నాలుగు బాగా బయటికి చాపండి అని చెప్తారు. కానీ మనకు ఎందుకు అలా అడుగుతారో తెలియదు. నాలుకలో డాక్టర్లకు మాత్రమే కనిపించి మనకు కనిపించనిది ఏమైనా ఉందా అంటే అలా ఎం లేదు. మన నాలుక రంగు చూసి మనం ఎలాంటి రకమైన రోగముతో బాధపడుతున్నామో డాక్టర్లకు సులభంగా అర్థం అవుతుంది. డాక్టర్లకు మాత్రమే కాదు ఇప్పుడు మేము చెప్పబోయేది చూసి మీకు కూడా మీరు ఎలాంటి రోగంతో బాధ పడుతున్నారో అద్దంలో మీ నాలుక రంగు చూస్తే అర్థం అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ నాలుక రంగుల గురించి తెలుసుకుందాం పదండి.
* మీ నాలుక యొక్క రంగు లేత గులాబీ రంగువలే ఉంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అర్థం.
* మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న గానీ లేదా మీకు రక్త ప్రసరణ సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే మీ నాలుక రంగు ఉదా గా ఉంటుంది. ఇది గ్రహించి తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచింది.

* మీకు జ్వరం కానీ తక్కువ విటమిన్ సి యొక్క పోషకాలు మీ శరీరం లో ఉంటే మీ నాలుక రంగు ఎరుపుగా ఉంటుంది.
* మీరు తరుచూ యాంటీ బయోటిక్స్ మందులు వాడితే మీ నాలుక యొక్క రంగు నల్లగా మారుతుంది. మీకు రోగనిరోధక శక్తి సమస్యలు ఉంటే మీ నాలుక మీద పుండ్లు ఏర్పడతాయి. ఇలా మీ నాలుక లోని రంగు బట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో డాక్టర్లకు తెలుస్తుంది. ఇకనుంచి మీకు కూడా తెలుస్తుంది