health tips in telugu
మలబద్ధకం సమస్య రాకుండా చేయాలనుకుంటున్నారా ! అయితే ఈ చిట్కాలు మీ కోసమే :-
Health Tips :- అవును ఇప్పుడున్న జనరేషన్ లో అందరికి మలబద్ధకం సమస్య కామన్ అయిపోయింది. దీనికి గల కారణం కూడా ఏ పని సమయానుసారంగా చేయకపోవడం. ఇప్పుడున్న జాబ్స్ కూడా టెన్షన్ తో కూడి ఉన్నవే ఎక్కువయ్యాయి కాబట్టి అందరూ పనిలో నిమగ్నం అయిపోయి ఏ టైమ్ కి తింటున్నాం అనే విషయం కూడా మరిచిపోయారు. ఒక షెడ్యూల్ వేసుకున్న పని ఒత్తిడి వల ఆ షెడ్యూల్ వృధా అయిపోతుంది. ఇలా టైం కి తినకపోవడం తోనే మలబద్ధకం సమస్య మొదలవుతుంది.

ఇలాంటి సమయం లో మీరు ఎం చేయాలో ఏం చేయకూడదో తెలియకపోతే మీ జీవితం చేతులారా నాశనం చేసుకున్న వారవుతారు.
ఇప్పుడు మనం మలబద్దకం సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు ఎం తీసుకోవాలో తెలుసుకుందాం.
- రోజూ ఎన్ని పనులు ఉన్న టైం కి మన కడుపులో భోజనం పడేలా చూసుకోవాలి.
- ఎన్ని పనులు ఉన్న టైం కి నిద్ర పోవడం ప్లాన్ చేసుకోండి. ఇది కష్టమే కానీ ప్రయత్నించండి.
- మాంసాహార పదార్థాలకు దూరం ఉండండి ఎందుకంటే ఇవి జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
- రాత్రి పుట్ట తిన వెంటనే పడుకోకుండా కాసేపు వాకింగ్ చేసి పడుకొండి.
ఇలా రోజూ చేయండి మీ ఆరోగ్యానికి ఎటువంటి భంగం కలగదు. అని రోగాలకు దూరం ఉంటారు.