భూమిక తన భర్తకు విడాకులు ఇచ్చిందా… నిజానిజాలు ఏంటి !

సినిమా ఇండస్ట్రీ లో పెళ్లిళ్లు ఎంత ఆలస్యంగా జరుగుతాయో, విడిపోవడం అంత త్వరగా జరుగుతూ ఉంటాయి. ఇదంతా సినీ ఇండస్ట్రీ వాళ్ళ విషయం లోనే కాకుండా బయట కూడా అలానే ఉంది అని చెప్పవచ్చు.
అసలు ఎమ్ జరిగింది అని చుస్తే, భూమిక ఎటూ వెళ్లిన సింగిల్ గా వెళ్లడంతో , తన భర్త ఎప్పుడు కనిపించకపోవడంతో , అలాగే షోషల్ మీడియాలో భూమిక తన ఫ్యామిలీ ఫోటోలు పెట్టకపోవడంతో , ప్రజలకు అనుమానం వచ్చి షోషల్ మీడియాలో భూమిక విడాకులు తీసుకుందని ప్రచారం జరిగింది.

భూమిక ఈ విషయంపై స్పందిస్తూ, తన భర్తతో దిగిన ఫోటోలను షోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ,తన వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తన భర్తకు తెలిపింది. అలాగే కొన్ని వేల అడుగులు కూడా ప్రేమ అనే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అని .. తన పెళ్లికి ప్రేమ అనే అండదండలతో ఇన్ని రోజులు కలిసి నడిచామంటూ తెలిపింది.
దీన్ని బట్టి తన అభిమానులు భూమిక తన భర్తతో కలిసే ఉందని తెలుసుకొని తనకి శుభాకాంక్షలు తెలిపారు.