health tips in telugu
భారీగా కండలు పెంచడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు : అయితే ఈ చిట్కాలు మీకోసమే :-
Workout Tips :- అవును అందరూ బాడీ బిల్డింగ్ కోసం ఇక్కడ లేని కష్టాలు పడుతుంటారు , కొంతమంది అయితే ఏకంగా జిమ్ లోనే ఎక్కువ శాతం సమయం గడిపేస్తుంటారు. సినిమాలో హీరోలను చూసి జిమ్ కి వెళ్లి కండలు పెంచాలని ప్రయత్నించిన వారు కూడా ఉంటారు. కానీ చివరికి ఫలించక నిరసించి బాధపడే వారి సంఖ్యే ఎక్కువ.

ఈరోజు దీనిపై మీకు కొన్ని చిట్కాలు చెప్తాము అది తుచ తప్పకుండా పాటించండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది.
జిమ్ లో ఎక్కువ సమయం గడిపినంత మాత్రాన కండలు వచేయవు. జింలో మనం ఎంత కష్టపడుతున్నామో అంటే ఇష్టంతో కొన్ని అత్యవసరమైన ఆహారాలు కూడా తీసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్న కండలు వస్తాయి. కండలు పెంచాలంటే మనకు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏ కావాలి.
- గుడ్లు మరియు చికెన్ రోజు జిమ్ చేశాక లంచ్ లో తినండి. చికెన్ లో కూడా చికెన్ బ్రెస్ట్ తినడం ఇంకా మంచిది. ఇవి జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కనుక ఇవి మధ్యాహ్నం పూట బాగా తినాలి.
- వాల్ నట్స్ మరియు పప్పు ధాన్యాలు ఉదయం పూట అయిన రాత్రి పూట అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ రెండు పదార్ధాలలో కొవ్వు అంశాలు తక్కువ మరియు ఫైబర్ , ప్రోటీన్ ఎక్కువ లభిస్తుంది.
ఇలా పై చెప్పబడిన రెండు చిట్కాలు పాటిస్తూ జిమ్ చేయండి మీరు కోరుకున్న కండరాలు కచ్చితంగా వస్తాయి.