బ్రహ్మం గారు మొదట తన తల్లిని అలా ఒప్పించాకే జ్ఞాని లా మారాడు.
బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణ చార్యులు, తల్లి పోతులూరి ప్రకృతాంబా, ఆయన జీవితకాల నిర్ణయం సరిగా లేకున్నా క్రీస్తు శకం 1608 లో జన్మించారు అని కొందరి అంచనా, క్రీస్తు శకం 1518 లో జన్మించారు అని కొందరి అంచనా ఆయన తండ్రి పేరు తల్లిపేరు ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది.

చిన్న వయస్సులోనే ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది ఆయన మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు, మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానభోద చేశాడు ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు.
అది నుంచి దేశాటనకు బయలుదేరాడు బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకు తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు, తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఆయన ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది.
ఆయన అక్కడి ప్రశాంత వాతావరణం ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు ఆయన గోవులకు ఒక వలయం ఏర్పరిచి దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆ వలయం దాటకుండా మేతమేస్తూ వచ్చాయి .
ఒక రోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకునేందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవైనా అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానభోద చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానభోద చేసాడు ఆయన మాట్లాడిన ప్రదేశాన్ని అని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు .