Tollywood news in telugu
Rashmika: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక…

“చలో” సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన..గీతగోవిందం, దేవదాస్ , డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి వరుస సూపర్ హిట్ లతో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తాజాగా రష్మిక తాను బాలీవుడ్ లో కూడా అడిగి పెడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

బాలీవుడ్ అగ్ర దర్శకుడు షాంతను భాగ్చీ నిర్మిస్తున్న
“‘మిషన్ మజ్ను” చిత్రంలో స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర సరసన రష్మిక నటిస్తుంది. నేడు “‘మిషన్ మజ్ను”
చిత్ర బృందం పోస్టర్ విడుదల చేశారు. ఈ మేరకు రష్మిక ఆ పోస్టర్ ని ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. తాను కొత్త బాలీవుడ్ జర్నీ లోకి అడుగుపెడుతున్న అందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
