Tollywood news in telugu
బాలయ్య పుణ్యమా అని…కంటతడి పెట్టుకున్న సౌందర్య ఫాన్స్ !

సౌందర్య ఈ పెరువినగానే తన అభిమానుల గుండెల్లో నుండి దుఃఖం తన్నుకొస్తోంది. సౌందర్య గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయి అయినా, ఒక తెలుగమ్మాయిగా మన తెలుగు అభిమానులు భావించారు.
ఈ స్టార్ హీరొయిన్ తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలయ్య లాంటి పెద్ద హీరో సరసన నటించి మంచి పేరు సంపాదించింది.
అలాంటి సౌందర్య 2004 లో BJP పార్టీ లో చేరి, ఎన్నికల ప్రచారానికై కరీంనగర్ బయలుదేరు సమయానికి ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కావడం వల్ల సౌందర్య తనువు చాలించింది.
సౌందర్య చివరగా నటించిన చిత్రం నర్తనశాల, ఈ సినిమాలో తాను ద్రౌపతి పాత్రలో నటించారు. సౌందర్య చనిపోవడంతో ఈ సినిమాను నిలిపివేశారు.
16 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నర్తనశాల మూవీ కి సంబందించిన 17నిమిషాల విడిది లో సౌందర్య యాక్ట్ చేసిన సన్నివేశాలను బాలయ్య విడుదల చేయడంతో, సౌందర్య అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.