ఫ్లాస్మా దానం తో కరొనపై యుద్ధం చేద్దాం అన్న :- మెగాస్టార్ చిరంజీవి
ఫ్లాస్మా దానం ఫై చిరు స్పందిస్తూ నేడు కరోనాతో యుద్ధం చేసే సమయం వచ్చింది , కరోనాతో యుద్ధం చేసి గెలిచిన ప్రతి ఒక్కరు ఫ్లాస్మా అనే ఆయుధాన్ని కరోనా బారిన పడి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి అందించాలని కోరుకుంటాను .

ఈ సందర్బంగా ఈ సీజనల్ టైం లో దగ్గినా , తుమ్మినా అనుమానం తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు , ప్రతిదాన్ని కరోనా వచ్చిందని భయబ్రాంతులకు లోను కాకూడదని తెలియ జేశాడు . ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ , శానిటైజ్ చేసుకుంటూ భౌతిక దూరం పాటించి వీలైనంత తొందరగా ఈ కరోనా మహమ్మారిని ప్రాలదోలుదాం .
అదేవిదంగా ఒక్కరు చేసే ఫ్లాస్మా దానం తో 30 మందిని బ్రతికించే అవకాశం ఉంది , మీరు చేస్తే ఫ్లాస్మా దానం మీకు మల్లి 2 రోజుల్లో రికవరీ అవుతుంది . ఫ్లాస్మా దాతలు ముందుకు వచ్చి కరోనా బాధితులకు భరోసా కల్పించాలని కోరుకుంటాను. ఈ సందర్భం లో చిరు ఫ్లాస్మా దాతలుకు సన్మానం చేసి వారిని ఎంతో అభినందించారు .