Political News

ప్రణబ్ కుమారుడి,కూతురి మధ్య చిచ్చు పెట్టిన ఆటో బయోగ్రఫీ..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.. ఆయన మరణించక ముందు.. ” ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్” అనే ఆటోబయోగ్రఫీ ని పుస్తకాన్ని రచించారు..

ఈ మేరకు ఇటీవలే ఆ పుస్తకం విడుదలైంది.. ఈ పుస్తకంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పాలన పై సంచలన వ్యాఖ్యలను ప్రణబ్ ప్రస్తావించారు… 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ముఖ్య కారణం సోనియా ,మన్మోహన్ సింగ్ అని వ్యాఖ్యానించారు… ఈ వాక్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి…

దీంతో తాజాగా ప్రణబ్ ముఖర్జీ కుమారుడు మాజీ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ స్పందించారు.ఆత్మకథ రచించిన రచయిత కుమారుడిని.. కాబట్టి నా అనుమతి లేకుండా ఆత్మ కథను ప్రచురించ రాదని.. తక్షణమే నిలిపివేయాలని పబ్లిషర్స్ కు ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నారు…

దీంతో తన సోదరుడు చేసిన వ్యాఖ్యలపై శర్మిష్ఠ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది… ప్రణబ్ రాసిన “ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్” ఆత్మ కథలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయవద్దని… తన తండ్రి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ఆత్మకథ రాశారాన్ని గుర్తు చేశారు”

Read  Janasena results : ఏపీ పంచాయతీ ఎన్నికలలో జనసేన సాధించిన విజయాలు...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button