పెరుగు చక్కర కలుపుకొని తింటున్నారా ! అయితే మీరు అదృష్టవంతులు. ఎందుకో తెలుసా ?
Health Tips :- నిజానికి ఎవరు పెరుగులో చక్కర కలుపుకొని తినరు. కొంతమందికి అయితే అస్సలు పెరుగు అనే పదమే ఇష్టం ఉండదు. అదేదో మెను లోనే ఉండకుండా చూసుకుంటారు. కానీ నిజానికి పెరుగు చక్కర కలుపుకొని తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా..

ఉదయానే టిఫిన్ చేయకముందు ఒక కప్పులో కావల్సినంత పెరుగు తగినంత చక్కర వేసుకొని బాగా కలుపుకొని తింటే ఆరోజు మీరు ఎప్పుడు ఊహించని రీతిలో గడుస్తుంది.
ఎందుకంటే పెరుగు మరియు చక్కర కలుపుకొని తినడం వల కడుపు చల్లగా ఉంటుంది.అసిడిటీ మరియు కడుపు సంబందించిన సమస్యలు రావు. మీ శరీరానికి కావల్సినంత శక్తిని తిన్న తక్షణమే ఇచ్చేస్తుంది. ఇందులో గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ కాబట్టి మీ శరీరంలో ఎటువంటి అనారోగ్యం లేకుండా చేస్తుంది.
నిజానికి పెరుగులో క్యాల్షియం, విటమిన్ బి-12, విటమిన్ బి-2, మెగ్నీషియం, పొటాషియం వంటి ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా పెరుగు అనే కాన్సెప్ట్ కి దూరం ఉంటే ఇప్పటినుంచి పెరుగు చెక్కర తినడం మొదలుపెట్టండి ఆరోగ్యంగా ఉండండి.