పెట్రోల్ బంకుల్లో చీప్ గా చిప్ మోసాలు:-

సైబరాబాద్ పోలీసులు చిప్ ద్వారా పెట్రోల్ బ్యాంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసారు.
గత కొంతకాలంగా ఈ చిప్ లను తయారుచేస్తూ పెట్రోల్ బ్యాంకుల యజమానులతో డీల్ కుదుర్చుకొని ఒక్కోచిప్ కు Rs .80,000. నుండి Rs. 1,20,000. వరకు అమ్ముతున్నారు.
దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం మీడియాకు షేక్ సుభానీ అలియాస్ భాషా ఏఈ ముఠాను నడుపుతున్నాడని తెలిపాడు.
సుభానికి పెట్రోల్ బంకుల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు మెకానిజం కూడా తెలియడంతో ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ,మరికొందరిని కూడా అలాగే తాయారు చేస్తున్నాడని సీపీ మీడియాకు తెలియజేసారు.
ఈ ముఠా సభ్యులు రెండు రకాల మార్గాల ద్వారా చిప్‌లను ఇన్స్టాల్ చేస్తారని సజ్జనార్ వివరించారు. అలాగే ఇలాంటి మోసాలకు పాల్పడేవారు ప్రజలకి అనుమానం రాకుండా క్యాన్లలో,బాటిల్ లో పెట్రోల్ నింపడానికి సపరేట్ పంప్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇప్పటికే ఏపీలో 22 చోట్ల ,ఈ చిప్ లను అమర్చి మోసాలకు పాల్పడుతున్నారని ,వీరికి సహకరించిన బంక్ యజమానుల పై చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు.