Tollywood news in telugu

పరిచయమైనా ఆరు రోజులకే… ఆలా అన్నాడు…!

mehreen bhavya bishnoi

mehreen bhavya bishnoi : అన్నీ బందాలకన్నా పెళ్లి బంధం చాల గొప్పది. పెళ్లి చేసుకున్న తరువాత మషులు ఒకటవుతారు కానీ, మనసులు దగ్గరవడానికి కొంత సమయం పడుతుంది. అందువల్లనే ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. పెళ్ళైనతరువాత ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగాకే బంధం బలంగా తయారవుతుంది.

కానీ హీరోయిన్ మోహరిన్ విషయంలో కేవలం ఆరు రోజుల స్నేహంతోనే  ‘భవ్య బిష్ణోయ్’ ను నిశ్చితార్థం చేసుకుంది.

 రాజకీయ నేపథ్యం ఉన్న భవ్య ను త్వరలో మోహరిం పెళ్లిచేసుకోనుంది. ఈ మధ్యనే అతి తక్కువ బంధువుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. ఇపుడు తాజాగా  తన భర్త గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

పోయిన సంవత్సరం మేము అనుకోకుండా మొదటిసారి కలుసుకున్నాము. తరవాత కరోనా  కారణంగా మల్లి ఎక్కువగా కలుసుకొనే  అవకాశం దొరకలేదు. కానీ ఒకరికొకరం మా విషయాలను ఫోన్ లో షేర్ చేసికొనెవాళ్ళం. నేను అడిగే ప్రశ్నకి తన స్పందన చాల నిజాయితీగా ఉండేది. అందువల్ల తనపై గౌరవం ఏర్పడింది.

ప్రేమ ప్రపోజల్ మోహరిన్ విషయంలో చాల విచిత్రంగా జరిగింది. గత నెలలో భవ్య, మోహరిన్ అండమాన్ దీవులకు వెళ్లారు. అక్కడ స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రపు అడుగున మోహరిన్ కు భవ్య ప్రేమ ప్రపోజ్ చేసాడట. అప్పటికే భవ్యను ఇష్టపడుతున్న మోహరిన్ వెంటనే ఓకే అనేసిందట. ఇక ఇలాంటి రొమాంటిక్ , డిఫరెంట్ ప్రపోజ్ ని తన మధుర జ్ఞాపకంగా చెప్పుకొచ్చింది.

ఇక వీరి నిశ్చితార్థం వేడుకకు వీరే అన్నిపనులు చూసుకున్నారు. ఎందుకంటే ఇది వీరి జీవితంలో ముఖ్యమైన సందర్భం కాబట్టి చాల గ్రాండ్ గా  ఉండాలని , డెకరేషన్ విషయంలో, అతిధుల విందు విషయంలో  తగిన జాగ్రత్తలు తీసుకున్నాం అని మోహరిన్  తెలిపింది.

 మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి, కాబట్టి మా బంధం చాల బలంగా ఉంటుందని నమ్ముతున్నాను. పెద్దల ఇష్టప్రకారమే మేము ఒకటి కాబోతున్నాము. అందుకనే మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి అని అంటూ ఉంటాను.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button