Today Telugu News Updates

నేడే బంద్, నేతల మధ్య మాటల యుద్దం

దేశంలో బీజేపీ ప్రభుత్వం ప తనం కాక తప్పదని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు . సోమవారం మండల కేంద్రంలో రాజకీయా , ప్రజాసంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ.దేశంలోని రైతుల జీవన భద్రతను కేంద్ర ప్రభుత్వం గాలిలో దీపాన్ని పెట్టినట్లు చేసిందని ఆమె మండిపడ్డారు .. దేశానికి వెన్నుముక అయినటువంటి రైతుల వెన్నును విరిచే మొండి వైఖరి మోడీ ప్రభుత్వం చేస్తుందని ఆమె విమర్శించారు.అన్నదాత ఆర్తనాదాలు బీజేపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కాలయా పన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు . ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు ఆగబోయిన రవి , వజ్ర సారయ్య , కొమ్మనబోయిన వేణు , పుల్లన్న , ప్రభాకర్ , దాట్ల నాగేశ్వర్ రావు జడ్పిటిసి పుష్ప లత తదితరులు పాల్గొన్నారు

నేడు దేశ వ్యాప్తంగా నిర్వహి 0 చే భారత్ బందును విజయవంతం చేయాలని వామ పక్ష పార్టీలు , రైతు సంఘాల ఆద్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీని నిర్వహించారు . అనంతరం తెలంగాణ రా శ్ర రైతు సంఘం అధ్యక్షులు తమ్మెర విశ్వేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమానుషంగా రైతులను నష్ట పరిచే విధంగా రూపొందించిన రైతు వ్యతిరేక బిల్లు లను రద్దు చేయాలని కోరుతూ గత 10 రోజులుగా చలిని సైతం లెక్కచేయకుండా డిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరి స్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .

నేడే బంద్, నేతల మధ్య మాటల యుద్దం

అన్నదాతను దగా చేస్తున్న ప్రభుత్వాలు….. రైతు వ్యతిరేక బిల్లులను ప్రవే శ పెట్టి రైతులను దగా చేస్తున్నారని , వరదల వలన న స్ట పోయిన రైతులు పండించిన సన్న వరిధాన్యాలకు మ ద్దతు ధర క్వింటాలుకు 2500 చెల్లించి కొనుగోలు చే యాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు . సోమ వారం జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో వామపక్ష రైతు కార్మిక కార్యకర్తల ఒక్కరోజు నిరాహార దీక్షలో సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శి లు కొరిమి రాజ్ కుమార్ , బందు సాయిలు లతో కలిసి పా ల్గొ ని గండ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు సన్న ధా న్యాన్ని కొనుగోలు చేయాలని కనీస మద్దతు ధర చెల్లిం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవ తీసుకొని తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని , అర్హులైన ప్రతి రైతుకి పట్టా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని అదేవిధంగా కేంద్రం తెచ్చిన 3 అగ్రి చట్టాలు రద్దు చేయాలని , విద్యుత్ సంస్కరణలు రద్దు చేయా లని , కేంద్రం ప్రభుత్వం లో సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం ప్రభుత్వం ద్వారా రైతులను ఆదుకు నేందుకు ప్రయత్నం చేయడం లేదని అన్నారు .రైతుల పై పోలీసుల దాడులు నిరసిస్తూ ఈ నెల 8 వ తేదీన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు . భారత్ బంద్ కు వామపక్షాలు సంపూర్ణ సం ఘీభావాన్ని తెలియజేశాయ న్నారు . జిల్లా వ్యాప్తంగా రైతులంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారత్ బందులో పాల్గొని తమ నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు.మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక ధోరణి అవలంబిస్తోందన్నారు . రైతులు ఆందోళన చేపట్టి పది రోజులు అవుతున్నా కేంద్ర పాలకులు నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు .

దేశానికి అన్నం పెట్టే రైతన్న ల కోసం , వ్యవసాయ రక్షణ కోసం ఇప్పటికీ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు . దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు , పెట్టుబడిదారులకు , బహుళజాతి సంస్థలకు అప్పగించేందుకు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు . కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లు తుందన్నారు . కేంద్ర ప్రభుత్వం మూడు సార్లు చర్చలకు పిలిచి ఎలాంటి న్యాయపరమైన , స్పష్టమైన హామీని రైతు లకు ఇవ్వలేక పోయిందని విమర్శించారు .

నేడు దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యలపై బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెరాస సంపూర్ణ బంద్ కు మద్దతిస్తుం ద ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు . సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల మా వేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రా స్త్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు , వాణిజ్యవ్యాపార సంస్థలు ఉ త్సాహంగా బంద్ లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవ ంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు . నేడు జరిగే బ ంద్ కార్యక్రమంలో హుజురాబాద్ లో నేను సైతం పాల్గొటుంన్నట్లు ఆయన తెలిపారు . రైతుల అభివృద్ధి , స ంక్షేమం కొరకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button