Today Telugu News Updates
నడిరోడ్డు పైనే 21 ఏళ్ళ యువతిని కాల్చి చంపినా దుర్మార్గుడు…. వీడియో వైరల్.. !

నిఖితా అనే 21 ఏళ్ళ యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తనని గత కొంతకాలంగా ప్రేమ పేరుతో తనని వేధిస్తున్నాడని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయం లో తన తండ్రి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు కంప్లైంట్ చేసాడు. ఐనకాని తౌసీఫ్ ఆగడాలు ఆగలేదు. ఆ యువకుడి వేదనని భరించలేక కొన్నిరోజులు తాను కాలేజ్ కి వెళ్లడం మానేసింది.
నిఖిత కి డిగ్రీ ఎగ్జామ్స్ ఉండడంతో ఇంట్లోనే ప్రిపేర్ అయి ఎగ్జామ్స్ రాసి బయటికి రాగానే ఆ దుండగుడు కారులో ఎక్కించే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో ఆ యువతీ ప్రతిఘటించడంతో తనని నడి రోడ్డు పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి కారులో పరార్ అయ్యారు.
ఈ సంఘటన హరియానాలోని ఫరీదాబాద్ లో జరిగింది. ఈ కాల్పుల విషయం పై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది.