Today Telugu News Updates

దేశంలోకి మరో ప్రాణాంతక వ్యాధి…!

భారతదేశమంతా కరోనా కేసుల తగ్గుతుండటంతో పాటు బాధితులు కోరుకుంటున్న సందర్భంలో… ఒక ప్రాణాంతక వ్యాధి దేశంలో ప్రవేశించి గుబులు పుట్టిస్తుంది.. ఆ వైరస్ పేరు మ్యూకోర్మైకోసిస్‌… ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో 44 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో 9 మంది చనిపోయారు.. ఇంకా ఈ వ్యాధి ఢిల్లీ,ముంబైలో కూడా పలువురు వ్యాధికి గురైనట్లు తెలుస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులో 50 సంవత్సరాల పైబడిన వారే ఉండటం గమనార్హం… కరోనా నుండి కోలుకున్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారట…

మ్యూకోర్మైకోసిస్‌ ప్రమాదకరమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిన బారిన పడితే మెదడుతో పాటు పలు అవయవాలు పని చేయకుండా పోతాయట…

మ్యూకోర్మైకోసిస్‌ ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్.. మొదట ఈ వ్యాధి ముక్కులో నుండి పాకి క్రమక్రమంగా కళ్ళకు పాకుతుంది. దీంతో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button