Tollywood news in telugu
దర్శకుడు రాజమౌళి కి బెదిరింపులు…. ఎవరా వ్యక్తి !

RRR సినిమాకి సంబంధించి కొమురం భీం పాత్ర పై వివాదాలు చెలరేగుతున్నాయి. పాత్రలో ముస్లిం గెటప్ ఉండడంతో కొమురం భీం కి సంబదించిన సన్నివేశాలపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనికి సంబంధించి ఆదిలాబాద్ ఎంపీ బాపూరావు మాట్లాడుతూ కొమురం భీమ్ చరిత్రని వక్రీకరిస్తే , సహించబోమని రాజమౌళికి వార్ణింగ్ ఇచ్చారు.
ఒక పోరాట యోధునికి ముస్లిం టోపీ పెట్టడం ఏంటని ఎంపీ మండిపడ్డారు. ఇలాంటి సన్నివేశాలు ఉంటె సినిమా విడుదలకి ముందే తీసేయాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో సినిమా విడుదలరోజే పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.