Today Telugu News Updates

తెలంగాణలో దారుణ హత్య

కులంలో కులపెద్ద హోద దక్కలేదన్న అక్కస్సు పెంచుకున్న వ్యక్తి కులపెద్దగా ఎన్నికైన వ్యక్తిని అంతమొందించిన విషాదకరమైన సంఘటన మోత్కూ ర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది . ఈ హత్యకు పాల్ప డిన నింధితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాం డకు తరలించారు . ఈకేసుకు సంబంధించిన వివరాలను భువ నగిరి జోన్ డిసిపి కె.నారయణరెడ్డి భువనగిరిలో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు .

ఆయన తెలిపిన వివరా ల ప్రకారం …. దాచారం గ్రామానికి చెందిన తాటిపాముల మహేష్ వివాహం జనగాం జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన యువతితో బుధవారం జరగాల్సి ఉండగా మంగళవారం బంధువులు , కొందరు గ్రామస్తులు పాకాల గ్రా మానికి వెళ్లారు . పెళ్లి కూతురు ఇంట తమకు మర్యాదలు సరి గా చేయడం లేదని , మటన్ పెట్టడం లేదని దాచారం గ్రామా నికి చెందిన సూరారం వెంకటయ్య అదే గ్రామానికి చెందిన కుల పెద్ద అయిన సూరారం చంద్రయ్యతో గొడవ పడ్డాడు .

మంగళవారం సాయంత్రం దాచారం గ్రామానికి వచ్చిన తర్వాత కూడా వెంకటయ్య అదే విషయమై చంద్రయ్యతో ఘర్షణకు దిగాడు . ఈ క్రమంలో పాలివాళ్లు అయిన వెంక టయ్య , చంద్రయ్య మధ్య గొడవ కాస్త వారి కుమారుల మధ్య ఘర్షణకు దారి తీసింది . ఈ నేపథ్యంలో వెంకటయ్య కుమా రుడు ప్రవీణ్ గొడ్డలితో చంద్రయ్య ఇంటికి వెళ్లి అతని కుమా రులు పరశురాములు ( 30 ) , నాగరాజులపై విచక్షణారహితం గా దాడికి తెగబడ్డారు . ఈ దాడిలో పరుశరాములు మెడ , తల పై , నాగరాజు ఎడమ చేతిపై ప్రవీణ్ నరికాడు . దీంతో తీవ్ర గాయాలైన పరుశరాములు రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు . ఇద్దరిని హుటాహుటిన చికిత్సకోసం 108 లో భువన గిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా పరశురాములు మార్గ మధ్యలో మృతి చెందాడు .

నాగరాజు పరిస్థితి విషమంగా ఉం డటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రైవేటు ఆసుప త్రికి తరలించారు . మృతుని సోదరుడు నాగరాజు ఫిర్యాదు మే రకు హత్యకు పాల్పడిన సూరారం ప్రవీణ్ , అతని తండ్రి వెంక టయ్యతో పాటు సూరారం కృష్ణ , సూరారం యాదమ్మ , సూ రారం చింటు , చిల్లర రమేష్ , సూరారం వెంకటమ్మలపై మో త్కూర్ పోలీసులు కేసు నమోదు చేశారు . హత్య చేసిన నింధి తులు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చే స్తుండగా గురువారం ఉదయం దత్తప్పగూడెం గ్రామం వైపు వెళ్తున్న ప్రవీణ్ , వెంకటయ్య , వెంకటమ్మలను పోలీసులు పట్టుకున్నారు . వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డిసిపి వెల్లడించారు . ఈ మీడియా సమావేశంలో చౌటుప్పల్ ఎసిపి పి.సత్తయ్య , రామన్నపేట సీఐ సిహెచ్ . శ్రీనివాస్ , మో త్కూర్ ఎన్ఏ టి.ఉదయ్ కిరన్లు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button