Political News

తన ఆవులను ఎత్తుకెళ్లారు అంటూ ఓ ఎమ్మెల్యే డీజీపీకి ఫిర్యాదు

తన ఆవులను ఎత్తుకెళ్లారు అంటూ ఒక ఎమ్మెల్యే డీజీపీకి ఫిర్యాదు చేశారు ఇది ఎక్కడనో జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఓ ఎమ్మెల్యే తన ఆవులను ఎవరు దొంగలించారో కనిపెట్టాలని డీజీపీని కోరారు.

పూర్తి వివరాల్లోకి వెళితే…సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూడు నెలల క్రితం తను పెంచుతున్న ఆరు ఆవులను ఎవరో అపహరించడంతో… స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఆవులు కనిపెట్టడంలో పోలీసులు విఫలం అవడంతో… శుక్రవారం ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిజిపికి ఫిర్యాదు చేశారు. తన ఆవులతో పాటు చాలామంది పెంచుతున్న ఆవులను కూడా ఎవరో ఎత్తుకు వెళుతున్నారన్ని.. వారిని కనిపెట్టి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిజిపిని ఒక వీడియో ద్వారా కోరారు.

Read  Gujarat Civic Polls Results: గుజరాత్ లోని ప్రారంభమైన కౌంటింగ్.. మరి కాసేపట్లో రానున్న రిజల్ట్...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button