Today Telugu News Updates
జెఈఈ,నీట్ లని వాయిదా వేయడం కుదరదు:- సుప్రీం కోర్ట్

కరోనా దేశాన్ని పట్టిపీడిస్తున్న సమయం లో జెఈఈ,నీట్ లని వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించారు .
ఇప్పటికే తల్లిదండ్రులు ,విద్యార్థులు జెఈఈ,నీట్ పరీక్షల విషయం లో తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు.
కానీ ఈ 11 మంది విద్యార్థులు వేసిన పిటిషన్ ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వం లో విచారించి ,కరోనా కారణంగా పరీక్షలను వాయిదా వేయడం కుదరదని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది.
కరోనా ఇపుడు తగ్గేది కాదు,వచ్చే ఏడాది కూడా ఇలానే ఉంటె అపుడు ఏంచేస్తారు అని ప్రశ్నించింది.
తగిన జాగ్రత్తలు తీసుకొంటూ పరీక్షలకు హాజరు కావాలి అని ధర్మాసనం చెలిపింది.
దీనికి సంబందించి సెప్టెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు జె ఈ ఈ ,సెప్టెంబర్ 13 నుండి నీట్ నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కోర్ట్ అంగీకరించింది.