చైనాలో మరో కొత్త వైరస్ కలకలం :-

చైనా ప్రజలను మరో వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తుంది . దీని పేరు ఎస్ఎఫ్టీఎస్ వైరస్,. దీనిని బున్యా వైరస్ అని కూడా పిలుస్తారు . ఇది సాలీడు లాంటి జీవి అయిన టిక్ కాటు ద్వారా వ్యాపి చెందుతుంది . చైనాలో ఇప్పటి కి 60 మందికి పైగా వైరస్ సోకగా ఏడుగురు చనిపోయారు .
చైనా మీడియా కథనాల ప్రకారం తూర్పు చైనాకు చెందిన జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన 37 మందికి గత ఆరు నెలల్లో ఎస్ఎఫ్టీఎస్ వైరస్ సోకింది. తరవాత తూర్పు చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లో 23 మంది ప్రజలకి కి సోకినట్లు గుర్తించామని తెలియజేసారు .
జియాంగ్సు రాజధాని నాన్జింగ్లో ఒక మహిళకు ఈ వైరస్ బారిన పడింది .ఆ మహిళకి జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి. తన శరీరంలో ల్యూకోసైట్, బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గడం కూడా కనిపించింది. నెల రోజుల చికిత్స తీసుకొని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చింది. .
ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని జెజియాంగ్ విశ్వవిద్యాలయ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ షెంగ్ జిఫాంగ్ తెలిపారు . వైరస్ సోకిన రోగి యొక్క రక్తం, చెమట ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఆందోళన పడాల్సిన పని లేదని పరిస్థితి అదుపులో ఉందని నిపుణులు చెప్తున్నారు.
ఎఫ్టీఎస్ వైరస్ కొత్తది కాదు. 2011 లో శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ను వేరు చేశారు. ఎస్ఎఫ్టీఎస్ వైరస్ బన్యావైరస్ వర్గానికి చెందినది. చైనాలోని నిపుణుల తెలిపారు , . దీని ద్వారా జ్వరం, ప్లేట్లెట్స్, ల్యూకోసైట్లు వేగంగా పడిపోవడం జరుగుతుందని .
ఈ వైరస్ సోకినట్లయితే మరణించే ప్రమాదం 12% వరకు ఉండొచ్చు అని నిపుణులు అంటున్నారు .