News

చంపేస్తా అంటూ TRS ఎమ్మెల్యే బెదిరింపు , జర్నలిస్టుల ఆగ్రహం

జర్నలిస్టులను దూషిస్తూ భావప్రకటన స్వేచ్ఛను కాలరాసే అధికారం ఎంఎల్‌కు ఎవరిచ్చారని తెలం గాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ( టి యుడబ్ల్యుజె ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరా హత్ అలీ ప్రశ్నించారు . వార్త విలేకరి సంతోష్ నాయక్ పై పటాన్ చెరువు ఎంఎ్ప మహి పాల్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు , బెది రింపులను నిరసిస్తూ గురువారం నాడు పటాన్ చెరువు లోని తొమ్మిదో నెంబర్ జాతీయ రహదా రిపై టియుడబ్ల్యుజె ఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు .

ఈ ఆందోళన కార్య క్రమానికి హాజరైన విరాహత్ అలీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు . అనంతరం రాస్తారోకో సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వా మ్యంలో నాలుగో స్థంభంగా ఉన్న మీడియా పట్ల చట్ట సభ ప్రతినిధులు వ్యవరిస్తున్న తీరు సహించారనిదన్నారు . వీధి గుండాల్లా జర్నలి స్టుల పట్ల వారు అనుసరిస్తున్న ప్రవర్తనతో సభ్య సమాజం సిగ్గు పడుతుందన్నారు . బాధ్యతా యుతమైన పదవిలో ఉన్నామనే విషయాన్ని మరచి వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న జర్నలి స్టుల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం విచారక రమన్నారు . నారాయణ్ ఖేడ్ ఎంఎల్పీ భూపాల్ రెడ్డి , దుబ్బాక ఎంఎల్‌ రఘునందన్ రావు , మల్కాజిగిరి ఎంఎ మైనంపల్లి హన్మంతరావు , తాజాగా పటాన్ చెరువు ఎంఎ లవ్ మహిపాల్ రెడ్డిలు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు , హెచ్చరికలు రాజ్యాంగాన్ని అవమా నపరిచే విధంగా ఉన్నాయని విరాహత్ అలీ ధ్వజమెత్తారు .

Read  Varavara Rao gets conditional bail : గోరేగావ్ కుట్ర కేసులో ఏడాది గ జైలులో ఉన్న... వరవరరావుకు బెయిలు మంజూరైంది...!

రాజ్యాంగేతర శక్తులు ఏ స్థాయిలో వున్నా వారికి తగినరీతిలో గుణ పాఠం చెప్పిన చరిత్ర తెలంగాణ జర్నలిస్టులకు ఉందనే సత్యాన్ని రాజకీయులు మరచిపోరా దని ఆయన గుర్తు చేశారు . జర్నలిస్టులు అవాస్త వాలు రాస్తే వాటిని ఖండించుకునే హక్కు ఉంటుందని , తప్పా , చట్టాన్ని చేతుల్లోకి తీసు కొని దౌర్జన్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికి లేద న్నారు . 2001 లో పటాన్ చెరువు ఎంపిపి అధ్య క్షుడిగా కొనసాగిన మహిపాల్ రెడ్డి తన సోద రుడు మధుసూదన్ రెడ్డి ద్వారా అప్పటి వార్త విలేకరి శంకర్ రావుపై దాడి చేయించగా నాటి ఎపియుడబ్ల్యుజె అతనికి తగిన బుద్ధి చెప్పిందని విరాహత్ గుర్తుచేశారు . తన వ్యాఖ్యలతో జర్న లిస్టు లోకాన్ని అవమానపర్చిన మహిపాల్ రెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు .

అరెస్టులో జాప్యమెందుకు ? రెండు రోజుల క్రితమే అమీన్ పూర్ పోలీస్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైన ఎంఎల్‌వ్ మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయడంలో జాప్యం చేయడం ఎందుకని ? విరాహత్ పోలీసులను ప్రశ్నిం చారు . రాస్తారోకో అనంతరం జర్నలిస్టులతో కలిసి ఆయన పటాన్ చెరువు డిఎస్ పి భీంరెడ్డిని కలిసి మాట్లాడారు . సామాన్య పౌరులకు ఓ చట్టం , అమాత్యులకు ప్రత్యేక చట్టం ఉంటుందా ? అని ఆయన ప్రశ్నించారు . ఈ ఆందోళన కార్యక్రమంలో టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్ పాల్గొన్నారు .

Read  IPL Auction 2021 : IPL వేలంలో భారీ ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ ...ఎవరో తెలుసా...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button