Tollywood news in telugu

ఖిలాడీ లుక్స్ తో కేక పుట్టిస్తున్న రవితేజ

khiladi poster
khiladi poster

khiladi poster: రవితేజ హీరో గా  రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ ‘ఖిలాడీ’ చిత్రం ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదలచేసింది. హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై  సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పూజ కార్యక్రమంలో భాగంగా ‘ఖిలాడీ ‘పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో  బ్లాక్ డ్రెస్ లో టక్ వేసుకోని రవితేజ చాల స్లిమ్ గా కనిపించాడు. అలాగే రవితేజ వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో ఎగురుతున్న కరెన్సీ నోట్ల  ఉండడంతో ఈ సినిమా పై క్యూరియాసిటీ పెంచేస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. ‘ఖిలాడీ’ అనే మూడు అక్షరాలు ఉండడంతో ఈ టైటిల్ జనాల్లోకి తొందరగా వెళ్తుందని, రవితేజకు ఈ టైటిల్ బాగా సూట్ అవుతుందని నమ్మి ఈ సినిమాని నిర్మించబోతున్నామని కోనేరు సత్యనారాయణ తెలిపారు.

ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమాలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ‘ఖిలాడీ ‘ కూడా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని  రమేష్ వర్మ తెలిపాడు. 

Read  ఆర్ జి వి దీపావళి: అమ్మాయిల కిందే కాదు ఆటంబాబులకింద కూడా కెమెరా పెట్టగలను అంటూ... బోల్డ్ కామెంట్ !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button