కోలీవుడ్ లో 45 సం,,లు తన సినీ జీవితాన్ని పూర్తి చేసుకోనున్నారు హీరో రజనీకాంత్:-

తన దైన నటనతో చిన్న ,పెద్దా అని తేడాలేకుంటడా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచ్చిపోయిన తలైవా తన సినీ జీవితాన్ని విజయవంతంగా 45 సం,,లు పూర్తి చేసుకోనున్నారు .
తలైవా తొలి సినిమా “అపూర్వ రాగంగాళ్ ” 1975 ఆగస్ట్ 15న రిలీసయింది , ఈ సినిమా ను కె . బాలచందర్ డైరెక్షన్ లో చిత్రీకించబడి ఎంతో విశేష ఆదరణ పొందింది .
ఈ సినిమాలో హీరో గా కమలహాసన్ నటించినప్పటికీ , రజనీకాంత్ ఒక చిన్న పాత్రలో తనదైన శైలిలో మెరిశాడు . ఇక అప్పటినుండి రజనీకాంత్ సినిమాల వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం రాలేదు .
రజని తన నిజ జీవితం లో ఒక బస్సు కండక్టర్ గా చేసినప్పటికీ , అనుకోని విదంగా కోలీవుడ్ లోకి ఎంటరై తనదైన స్టైల్ లో ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపి, ఎంతో మందికి తనకి చేతనైన సహాయాన్ని చేస్తూ , సినీ అభిమానుల గుండెల్లో తనకంటూ ఒక చోటు సంపాదించుకున్నాడు.
ఇప్పటికి తన సినిమాలతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు , కొలీవూడ్ లోకి ఎంతమంది హీరోలు వస్తున్నా , రజిని తరవాతే ఎవరైనా అనే స్థాయికి వెళ్ళిపోయాడు .
ఈ నెల 15తో తన సినీ కెరీర్ ని 45సం,, లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఇపుడు రజని “అన్నతేయ్య్ “సినిమాలో బిజీగా ఉన్నారు .