కేసీఆర్ నా దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారు: విజయశాంతి

ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో నుండి భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె బిజెపిలో చేరినప్పటి నుంచి కెసిఆర్ పై ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా కేసీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అందరి దగ్గరనుండి డబ్బులు తీసుకునేవాడని, అలాగే తన వద్ద నుండి కూడా తెలంగాణ ఉద్యమం కోసం కొంత డబ్బు తీసుకున్నాడన్ని పేర్కొంది.

ఆ డబ్బులు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కదారి పట్టించాడని విజయశాంతి విరుచుకుపడింది. ఆ తర్వాత కెసిఆర్ సీఎం అయిన తర్వాత చాలా డబ్బులు వెనకేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై విజయశాంతి అసహనం వ్యక్తం చేసింది. ఆ పార్టీలో కూడా కొందరు నాయకులు కెసిఆర్ కి తొత్తుగాళ్ళుగా వ్యవహరిస్తున్నారన్నారు .తన ముందు తప్పు జరుగుతున్నప్పుడు కెసిఆర్ ను ప్రశ్నిద్దాం అంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారన్నారు. తను అందుకే బిజెపిలో చేరానని తెలిపింది
