కేటీఆర్ ప్రకటనతో పోటెత్తిన జనం
కేటీఆర్ ప్రకటనతో పోటెత్తిన జనం వరద సాయం రూ .10 వేలు కోసం పెద్ద సంఖ్యలో ఈసేవ , మీసేవ కేంద్రాలకు బాధితులు పోటెత్తారు . ఈ సేవ , మీసేవ కేంద్రాల్లో వరద బాధితులు దరఖాస్తు చేసుకుంటే పరిహారం అందచేస్తామని మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావును ప్రకటించిన విషయం తెల్సిందే . ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు బారులు తీరారు . గంటల తరబడి వరుసలో నిల్చున్నారు . వృద్ధులు , మహిళలే అధిక సంఖ్యలో కేంద్రాల వరుసలో నిలబడటంతో ఇబ్బందులు ఎదుర్కున్నారు . పెద్ద సంఖ్యలో బాధితులు తరలిరావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు . కేంద్రాలలోకి వరుస క్రమంలో వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు . ఒక్కో దరఖాస్తుదారు నుంచి రూ .50 చొప్పున కేంద్రాల నిర్వహకులు ఫీజులు వసులు చేశారు . వరద పరిహారం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు బాధితులు భారీగా మీసేవ సెంటర్లకు తరలివచ్చారు .
సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ లో ఉన్న మీసేవకు బాధితులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు . ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు క్యూ కట్టారు . వరద సాయం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు సూచనలతో బాధితులు మీసేవ వద్ద గంటల తరబడి వరుసలో నిల్చున్నారు . ఇంటి యజమానితో పాటు అద్దెకు ఉంటున్న బాధితులు మీసేవ దరఖాస్తు చేసుకున్నారు . అడ్డగుట్టలో అయితే ఏకంగా రెండు కిలోమీటర్ల దూరం వరకు క్యూ కట్టారు . సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్న ప్రచారంతో పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చారు . సీతాఫలండి , చిలకలగూడ , అడిక్మెంట్ , రాంనగర్ , ముషీరాబాద్ , చిక్కడపల్లి , దోమల్ గూడ , ఎల్.బి.నగర్ , సరూర్‌నగర్ , ఉప్పల్ , ఇసిఐఎల్ , మల్లాపూర్ , నాచారం , పాతబస్తీలోని చార్మినార్ , చాంద్రాయణగుట్ట , తలాబ్ కట్టా , శివాజినగర్ , భవనినగర్ , మూసీ పరివహక ప్రాంతాలు , పురనపూల్ , ఖైరతాబాద్ , బొరబండ , సికింద్రాబాద్ , బేగంపేట్ , ప్రకాష్ నగర్ , బ్రాహ్మణ్ వాడి తదితర ప్రాంతాలలో వరద బాధితులతో కేంద్రాలు కిక్కిరిసిపోయాయి . దరఖాస్తుల పేరుతో దోచుకుంటున్నారని బాధితులు అసహనం వ్యక్తం చేశారు .
కేటీఆర్ ప్రకటనతో పోటెత్తిన జనం ::
మీసేవ కేంద్రాల దగ్గర పర్యవేక్షణ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ఇప్పటికే వరదలతో భారీగా నష్టపోయిన తమకు సాయం అందించడంలో అధికారులు వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు . నగరంలో చాలా చోట్లా సందేట్లో సడేమియాగా వరద ముంపునకు గురికాని వారు సైతం వరుసలో నిల్చుని దరఖాస్తు చేయడం గమనర్హం . ఇప్పటి వరకు నేరుగా అందించిన వరద సాయాన్ని నిజమైన బాధితులకు ఇవ్వకుండా అధికారులు , నాయకులు కుమ్మకైన దండుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి . ముంపునకు గురికాని ప్రాంతాల్లో ప్రజలకు రూ .500 , నుంచి రూ .1000 , రూ .2000 వేల చొప్పున ఇష్టామొచ్చినట్లు పంపిణి చేశారని ప్రజలు చెప్పుతున్నారు . ముషీరాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే రాంనగర్ లో ఒక భవనంలో వరద ముంపునకు గురికాలేదు . భవనంలోని నలుగు కుటుంబాలకు సంబంధించిన ఆధార్ కార్డు జిరాలు తీసుకొని , వారికి రూ .500 చొప్పున నాలుగురికి స్థానిక టిఆర్ఎస్ నాయకుడు ఇచ్చాడని చెప్పారు . ఇలా నగరంలో వరద సాయం నిజమైన బాధితులకు అందకుండా కొంతమంది నాయకులు , అధికారులు కుమ్మకై దండుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి .