Political News
Jaga Reddy Fires On KCR: కెసిఆర్ “కన్ఫ్యూజ్ సీఎం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇటీవలే సీఎం కేసీఆర్ యసంగి పంటపై మాట్లాడిన తీరు చూస్తే… కన్ఫ్యూజ్ సీఎం అని బిరుదు ఇవ్వవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పాలన ధృతరాష్ట్ర పాలనను తలపిస్తుందని అని ధ్వజమెత్తారు.మొదట సీఎం సన్నరకం వడ్లు వేయమని… వెయ్యకుంటే రైతుబంధు రాదని.. ఎలాగోలా రైతులను బెదిరించి పంట వేయడంతో… అకాల వర్షాల కారణంగా, పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతుల నష్టపోవాల్సి వచ్చిందని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు కెసిఆర్ మీకు నచ్చిన పంట వేసుకోడని చెప్పడం ఏంటని జగ్గా రెడ్డి ప్రశ్నించారు. అదే విధంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి, అమిత్ షా కి లొంగిపోయి.. నూతన వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తున్నారని జగ్గా రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ ఒక బాధ్యతగల సీఎంగా వ్యవహరించాలే గాని..చెప్రాసి లా కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు విమర్శలు చేశారు.