Tollywood news in telugu
ఓటిటి వేదికగా విడుదలకు సిద్దమవుతున్న చిత్రం ‘ వి ‘:-

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో హీరోలుగా నాని-సుదీర్ బాబు లు నటించిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .
ఈ చిత్రాన్ని ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా , కరోనా వల్ల ఆగిపోయింది . ఈ సినిమాని హిందీ లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇందులో నాని యొక్క పాత్ర క్రిమినల్ గా ఉండగా,పోలీస్ పాత్రలో సుదీర్ బాబు నటిస్తున్నాడు. ఈ క్రిమినల్ పాత్రలో నాని ఎలా ఉండనున్నాడో అని ప్రజలు చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇందులో అవసరాల శ్రీనివాస్ ,వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పథకం ఫై దిల్ రాజు ,శిరీష్,హర్షిత్ రెడ్డి నిర్మించగా , సెప్టెంబర్ 5న విడుదల కానుంది.