Today Telugu News UpdatesTollywood news in telugu

ఓటింగ్ లో గందరగోళం, ప్రముఖుల ఓట్లు గల్లంతు

గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పోరేషన్ ( జిహెచ్ఎంసి ) ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు . ప్రముఖుల ఓట్లు గల్లంతు అయ్యాయి మరో వైపు ఓటర్ల జాబితాలో పలువురు ప్రముఖుల ఓట్లు గల్లంత య్యాయి . కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి దంపతులు కాచిగూడలో , రాష్ట్ర మంత్రి కె.తారకరామా రావు దంపతులు నందినగర్ లో , సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి , ఎఐటియుసి జాతీయ కార్యదర్శి బి.వి.విజయలక్ష్మి గచ్చిబౌలి డివిజన్ లోని ఖాజాగూడ పోలింగ్ బూత్ లో , సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ హిమాయత్ నగర్ డివిజ లో , కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు బాగ్ అంబర్ పేటలో , బిజెపి ఓబిసి జాతీయ అధ్య క్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ చిక్కడపల్లిలో , ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రిపురంలోని సెయింట్ పాయిస్ పోలింగ్ బూత్ లో , టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ దంపతులు తార్నాక డివిజన్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . కాగా ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లో ఓటు హక్కు విని యోగించుకోవడం వివాదస్పదమైంది .

ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి . ఆన్ లైన్ లో ఓటర్ లిస్టులో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్ వద్ద లిస్టులో చూపించడం లేదని ఓటర్ల ఆందోళ నకు దిగారు . ఓటర్ స్లిప్లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవ డంతో నిరసన వ్యక్తం చేశారు . జియాగూడ పోలింగ్ బూత్ నెం .38 లో మొత్తం 914 ఓట్లు ఉండగా 657 ఓట్లు గల్లంతు అయ్యాయి . ఓటర్ల జాబితాలో ఎన్నికల్లో ఓటు దొరక్క సామాన్య జనంతో పాటు ప్రముఖులు కూడా ఇబ్బంది పడాల్సివచ్చింది . పలు చోట్ల పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం కలకలం రేపింది . ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు .

ప్రముఖుల ఓట్లు గల్లంతు

మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఫిలింనగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు . ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి , దర్శకుడు క్రిష్ , యాంకర్ ఝాన్సీ , నటుడు ఆలీ , సినీ రచయిత పరచూరి గోపాలకృష్ణ , నిర్మాత ఉషా ముళపారి , నటి మంచు లక్ష్మీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . అక్కి నేని నాగార్జున , ఆయన సతీమణి అమల , నటుడు రాజేంద్ర ప్రసాద్ జూబ్లిహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు . మందకొడి ఓటింగ్ పై రాజేంద్రప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు . నగర ప్రజలు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు . ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ సహా ఆయన కుటుంబ సభ్యులు , హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహి లో ఓటు వేశారు . డైరెక్టర్ తేజ , కోట శ్రీనివాసరావు , రెటర్ బీవీఎస్ రవి , హీరో రామ్ , నిఖిల్ , సాయిధరమ్ తేజ్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు .

ఫిలింనగర్ క్లబ్ లోని పోలింగ్ కేంద్రంలో 73 ఏళ్ల వయ స్సులో ఉన్న కోట శ్రీనివాసరావు ఓటు వేసేందుకు రావ డడాన్ని అక్కడి ఓటర్లు ఆసక్తిగా చూశారు . కాంగ్రెస్ నేత మల్లు రవి , తమ్మినేని ఓట్లు గల్లంతు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఓటు గల్లంతైంది . దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు . కాగా సిపిఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దంపతుల ఓట్లు గల్లంతు అయ్యాయి . మంగ ళవారం ఉదయం పోలింగ్ బాగ్ లింగంపల్లి డివిజన్లోని పోలింగ్ బూత్ కు వెళ్ళిన తమ్మినేని వీరభద్రం దంప తులు ఓటర్ల జాబితాలో ఓట్లు లేకపోవడంతో ఆశ్చర్యా నికి గురయ్యారు .

పోలింగ్ సిబ్బంది జాబితాలో ఎంత వెతికినా వారి పేర్లు కనిపించకపోవడంతో వారు వెనుది రిగారు . గంటపాటు నిరీక్షించి ఓటు వేసిన విహెచ్ కాంగ్రెస్ మాజీ ఎంపి వి.హనుమంతరావు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాగ్ అంబర్ పేట డిడి కాలనీలోని సత్యసాయి విద్యా మందిర్క్ వచ్చారు . అయితే జాబితాలో ఓటు కనిపించక గందరగోళ పరిస్థి తుల మధ్య ఆయన గంటపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది . పోలింగ్ సిబ్బంది వెతికి వెతికి మొత్తంమ్మీద ఆయన ఓటును గుర్తించారు . తర్వాత విహెచ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button