health tips in telugu
ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏవో తెలియక ఇబ్బంది పడుతున్నరా ! అయితే ఇది మీరు చదవాల్సిందే..:-
Iron Rich Foods :- మన శరీరంలో అన్ని అవయవాలకు కావల్సినంత ఆక్సిజన్ సప్లై చేసే హెమగ్లోబిన్ బాగా పని చేయాలంటే మన శరీరంలో కావల్సినంత ఐరన్ ఉండాలి. ఒకవేళ మన శరీరంలో ఐరన్ తక్కువ ఉందంటే అప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట లాంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే మనకు ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ఐరన్ కూడా అంతే ముఖ్యం ఎది లేకపోయినా బ్రతకలేము. ఇప్పుడు మనం మన శరీరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండాలంటే ఎం ఎం తినాలో తెలుసుకుందాం.
- ఐరన్ బాగా రావాలంటే ముందుగా మనం పచ్చసొన గుడ్డు తినాలి. రోజూ మనం ఇది తినడం వలన మనకు శరీరానికి కావల్సినంత ఐరన్ చేరుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- పచ్చసొన గుడ్డుతో పాటు బ్రోకలీ , పాలకూర తీసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. ఇవని ఐరన్ రిచ్ ఆహార పదార్థాలు.
- ఒకవేళ పై చెప్పబడిన ఐటమ్స్ తీసుకోవడం ఇష్టం లేకుంటే మాంసం బాగా తినండి. తరుచూ మాంసం తినడం వల మీకు రక్త సమస్య తగ్గి ఐరన్ కంటెంట్ పెంచుతుంది.
- చివరిగా శెనగలు , గుమ్మడికాయ గింజలు , సోయాబీన్స్ వంటి పదార్థాల వలన కూడా మన శరీరంలో కావాల్సిన ఐరన్ కంటెంట్ వస్తుంది.
ఇలా పై చెప్పబడిన ఆహార పదార్ధాలలో ఎది తీసుకున్న మీ శరీరానికి కావల్సిన ఐరన్ కంటెంట్ వస్తుంది.