Political News
ఎమ్మెల్యే రమేష్ పౌరసత్య విషయంలో…కేంద్రానికి షాక్..

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీలో పౌరసత్వం తీసుకున్నారని కేంద్ర హోంశాఖ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే…మొదట ఈ మిషన్ పై హైకోర్టు విచారించగా.. కేంద్ర హోంశాఖను డిసెంబర్ 16 వరకు న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది..

దీంతో డిసెంబర్ 16న తిరిగి హైకోర్టులో విచారణ జరిగింది..ఈ విచారణలో కోర్టు ఆదేశించినా ఆఫిడవిట్ సమర్పించకుండా మెమోల ద్వారా వివరాలు తెలియ చేయడం పట్ల హైకోర్టు కేంద్ర హోంశాఖ పై ఆగ్రహం వ్యక్తం చేసింది… 2020 ఫిబ్రవరి లో ఇచ్చిన మెమోనే సమర్పించడం ఏంటని? న్యాయస్థానం ప్రశ్నించింది…త్వరగా కేంద్రం ఆఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది…తదుపరి విచారణ జనవరి 20 కి వాయిదా వేసింది…
