health tips in telugu
ఎండుద్రాక్ష అధికంగా తింటున్నారా అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే :-
Raisins Side Effects :– మీరు రోజూ అధికంగా ఎండుద్రాక్ష తింటున్నారా అయితే చేతులారా మీ ఆరోగ్యంలో లేనిపోని రోగాలకు దారి ఇచ్చిన వారు అవుతారు.

ఎండుద్రాక్ష ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు మరియు డాక్టర్లు అంతెందుకు ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు. కానీ అది ఒక్క లిమిట్ వరకే , రుచి బాగుంది ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం అనే భ్రమలో తినేస్తే మాత్రం సమస్యలో చిక్కుకునట్లే.
- రోజూ 50 గ్రాముల కంటే తక్కువే ఎండుద్రాక్ష తినాలని శాస్త్రవేత్తలు నిరూపించారు.
- 50 గ్రాముల మించి తీసుకుంటే జీర్ణ సమస్యలు మరియు కడుపు కి సంబందించిన అనేక రోగాలకు మీరు చేతులారా దారి ఇచ్చిన వారు అవుతారు.
అన్నిటికంటే ముఖ్యంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు లేదా శరీరంలోని క్యాలరీలు తగ్గించాలని ప్రయత్నించే వారు ఈ ఎండుద్రాక్ష అనే పదార్థానికి ఎంత దూరం ఉంటే అంతా మంచిది.