Today Telugu News Updates

ఉత్కంఠ రేపిన ghmc ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎనికల సమయంలో సైతం ప్రజలు ఇంతగా ఫలితాల కోసం ఎదురు చూసి ఉండరు . రాజకీయాలతోటి ఎటువంటి సంబంధం లేనటువంటి వారు , సామాన్యులు సైతం గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపారు . ఉదయం నుంచి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే వరకు కొందరు టివిలకు అతుక్కుపోగా మరి కొందరు నిరంతరం సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించారు . . మధ్యాహ్నం మూడు గంటలకు ముందు టిఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించిన క్రమేపి సన్నగిల్లింది . శుక్రవారం వెలువడిన ఫలితాలపై ఎక్కడ చూసినా చర్చించుకోవడం కన్పించింది . ఖమ్మంజిల్లా నాయకులు పని చేసిన చోట టిఆర్ఎసు సానుకూల ఫలితాలు రావడం , కూకట్ పల్లి , శేరిలింగంపల్లి , కుత్బుల్లాపూర్ లో భారీ విజయాలు టిఆర్ఎస్ కు ఊరటనివ్వడం కూడా చర్చనీయాంశమయ్యాయి .

మహానగర పాలక వర్గ ఎన్నికలు రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్నే తమ వైపుకు తిప్పుకునేలా చేశాయి . ఎన్నికల ప్రచారమే జాతీయ స్థాయి వార్త అయితే ఫలితాలు కూడా అదే స్థాయిలో చర్చకు దారితీశాయి . నాలుగు స్థానాలున్న బిజెపి గొల్కొండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామని ప్రచారంలో గట్టిగా నినాదించడం హేమా హేమీలంతా ప్రచార రంగంలో పాల్గొనడంతో హైద్రాబాద్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కూతుహాలాన్ని ప్రతి ఒక్కరిలో పెంచాయి . ఇక శుక్రవారం లెక్కింపు సందర్భంగా ఎక్కడ చూసినా జనాలు టివిలకు అతక్కుపోయి ఫలితాల కోసం ఎదురు చూశారు . ఓ దశలో లెక్కింపు ఆలస్యం అవుతుందని అసహానం కూడా వ్యక్తం చేశారు . బిజెపి కొంత వెనకబడి ఆ తర్వాత బలం పుంజుకోవడంతో టిఆర్ఎస్ శ్రేణులు ఢిలా పడ్డాయి . సామాన్యులు హైద్రాబాద్ లో ఎవరు గెలుస్తున్నారు అంటూ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా పలు చోట్ల కన్పించింది . టిఆర్ఎస్ పట్ల కొంత మందికి వ్యతిరేకత కన్పించిన ఎందుకో ఖమ్మంజిల్లాలో బిజెపి బలపడడాన్ని చాలా మంది వ్యతిరేకించడం , బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడడం కన్పించింది .

ఇక ఖమ్మం , వరంగల్ పైన చర్చ సాగింది . ఖమ్మంజిల్లా నుంచి కాంగ్రెస్ , టిఆర్ఎస్లకు సంబంధించిన అనేక మంది ప్రచారానికి వెళ్లారు . ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచార బాధ్యతలను నిర్వహించిన కూకట్‌పల్లిలో ఎనిమిదికి గాను ఏడు స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధించడం గమనార్హం . కుత్బుల్లాపూర్ , శేరిలింగంపల్లి నియోజక వర్గాల్లోనూ టిఆర్ఎస్ భారీ ఆధిక్యతను చాటింది . మొత్తం టిఆర్ఎస్ 56 స్థానాలు గెలువగా అందులో 27 స్థానాలు ఈ మూడు నియోజక వర్గాల నుంచి గెలవడం ఇక్కడ ఖమ్మానికి చెందిన నేతలు ప్రచారం చేయడం టిఆర్ఎస్ శ్రేణులకు కాస్త ఊరటనిచ్చింది . ఖమ్మం నగర పాలక సంస్థలు త్వరలో జరగనుండగా హైద్రాబాద్ లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నగర ప్రజల్లో నెలకొంది . హైద్రాబాద్ ఫలితాలను బట్టి ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచార నేపథ్యంలో ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు . మొత్తంగా హైద్రాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button