telugu facts

ఈ హీరోల కంటే… వాళ్ల భార్య‌లే వ‌య‌స్సుల్లో పెద్ద‌! పైగా వీళ్లంద‌రివీ ల‌వ్ మ్యారేజ్ లే! ఆ జంట‌లివే.!!

భార్యాభర్తలో మగవారు కంటే ఆడవారు తక్కువ వయసు ఉండాలనే ఆచారం ఎప్పటినుండో వస్తుంది… అయితే కొందరు మాత్రం తమ వయసుతో సంబంధం లేకుండా …తమ మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు… ఈ ట్రెండ్ సినీ పరిశ్రమలో, క్రికెట్ క్రీడాకారులలో ఎక్కువగా ఉంది… ఆ జాబితాలో మనకు తెలిసిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారో లెరో… ఇప్పుడు తెలుసుకుందాం…

మహేష్ బాబు & నమ్రత:-

మహేష్ నమ్రత ప్రేమ వివాహం చేసుకున్నా విషయం అందరికీ తెలిసిందే.. అయితే నమ్రతా కి ఇప్పుడు 45 సంవత్సరాలు అలాగే మహేష్ కి 40 సంవత్సరాలు అంటే నమ్రత మహేష్ కన్నా ఐదు సంవత్సరాలు పెద్ద.

రామ్ చరణ్& ఉపాసన:-

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వివాహం కూడా ప్రేమ వివాహమే.. ఉపాసన రామ్ చరణ్ కన్నా ఐదు సంవత్సరాలు పెద్దది…

ఐశ్వర్యరాయ్ &అభిషేక్ బచ్చన్:-

ఐశ్వర్యారాయ్ మొదట వివేక్ రాయ్ తో ప్రేమలో పడింది… కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఐశ్వర్యరాయ్ లవ్ కి బ్రేకప్ చెప్పింది… అనంతరం చకచక అభిషేక్ బచ్చన్ తో పరిచయం.. ప్రేమగా మారి పెళ్లి పీటలు ఎక్కింది… కానీ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ కంటే రెండేళ్లు చిన్నవాడు…

ధనుష్& ఐశ్వర్య:-

తమిళ అగ్ర హీరో అయిన ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు… వీరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ 2 సంవత్సరాలు అంటే ఐశ్వర్య ధనుష్ కంటే రెండు సంవత్సరాలు పెద్దది.

స్నేహ&ప్రసన్న:-

అందాల తార స్నేహ సహ నటుడు ప్రసన్నతో వివాహం చేసుకున్నారు. స్నేహ కి ప్రసన్న కి మధ్యనున్న గ్యాప్ ఒక సంవత్సరం.. అంటే ప్రసన్న స్నేహ కంటే ఒక సంవత్సరం చిన్నోడు…

అనుష్క శర్మ& విరాట్ కోహ్లీ


ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక యాడ్ లో నటించబోతున్న సందర్భంలో అనుష్క శర్మ తో పరిచయమైంది… ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడానికి చాలా రోజులు పట్టలేదు… విరాట్ కోహ్లి కంటే అనుష్క శర్మ ఒక సంవత్సరం పెద్దది ..ప్రస్తుతం అనుష్క శర్మ కి 32 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ కి 31 సంవత్సరాలు…

బిపాసా బసు& కరణ్ సింగ్

టక్కరి దొంగ లో హీరోయిన్ గా నటించిన బిపాసబసు కరణ్ సింగ్ ని వివాహమాడింది. అసలకి బిపాసా బసు కరణ్ సింగ్ కంటే మూడు సంవత్సరాలు పెద్దది..

సచిన్ టెండూల్కర్ & అంజలి

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలిని ఒక ఎయిర్ పోర్ట్ లో చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు… అంజలి సచిన్ టెండుల్కర్ కన్నా ఆరు సంవత్సరాలు పెద్దది…

ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సెలబ్రిటీస్ ఈ జాబితానే ఉన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button