ఈ బుడ్డోడు… ఎంత పెద్ద మాస్ హీరో అయ్యాడో తెలుసా

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది బాలనటలుగా తెరంగ్రేటం చేసి…హీరోలు గా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నటులు బాల నటులుగా వెండితెరకు పరిచయమై…. హీరోగా సక్సెస్ సాధించారు. అలాగే అదే హీరో రేసులో దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్న ఒక హీరో ఎవరో తెలుసా…! అతనే మాస్టర్ నాగ్ అన్వేష్ ఈయన పేరు మీకు తెలియకపోవచ్చు… కానీ ఆయనను మీరు ఖచ్చితంగా చూసి ఉంటారు….
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా, సౌందర్య హీరోయిన్ గా నటించిన “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” చిత్రం అందరూ చూసే ఉంటారు….ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కొడుకు పాత్రలో నటించింది ఈ నాగ్ అన్వేషే .! ముఖ్యంగా ఈ చిత్రంలోని “తలలో మల్లె పూలు పెట్టాలి” అనే డైలాగుతో ఆ బాలుడు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోయాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు…
నాగ్ అశ్విన్ ఒకే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్వేష్ నటించలేదు…ఇటీవలె 2015లో “వినవయ్య రామయ్య” అనే చిత్రంలో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం నాగ్ అన్వేష్ కి నిరాశే మిగిలింది… అనంతరం 2017 లో ఏంజెల్ చిత్రంలో హీరోగా నాగ అన్వేష్ ,హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటించారు. ఈ చిత్రం మంచి హిట్ సాధించింది…. మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న నాగ అన్వేష్ ఇటీవలే టాప్ డైరెక్టర్ చిత్రంలో హీరోగా నటించబోతున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి… నాగ అన్వేష్ భవిష్యత్తులో ఏ స్థాయి కి వెళ్తాడో అనేది ముందు ముందు చూడాలి