News

ఇంట్లో నుండి యువతీ పరీక్ష ప్యాడ్ తో వెళ్లి…పసుపుతాడుతో వచ్చింది..తరువాత… !

తన ఇంట్లో ఈ రోజు నుండి పరీక్షలు జరుగుతాయని చెప్పి వెళ్లిన యువతి  పెళ్లి చేసుకుని పుట్టింటికి వచ్చింది. ఇది చూసిన యువతీ  తల్లిదండ్రులు షాక్‌కి లోనయ్యారు. ఈ సంఘటన  బీహార్‌లో చోటుచేసుకుంది. 

విషయానికి వెళ్తే…  మణిహరికి చెందిన గౌరి అనే యువతికి కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా  నితీష్ అనే యువకుడు  పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి వారి మధ్య ఫోన్  పరిచయం మొదలైంది.అతని మాటలకూ  ఆ పరిచయం కాస్తా స్నేహంగా , ఆ తరువాత ప్రేమగా మారింది.

ఈ విషయాన్నీ యువతీ ముందుగానే కుటుంబసభ్యులకు చెప్పింది. కానీ వారు  ఒప్పుకోలేదు. అదేవిదంగా  నితీష్ కుటుంబసభ్యులు కూడా ససేమిరా అన్నారు. ఇక చేసేదేమిలేక  ఇద్దరు ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  దీంతో తనకు పరీక్ష ఉందని ఇంట్లో చెప్పి వెళ్లిన గౌరి, నితీష్‌తో కలసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

తాము ఇద్దరూ ప్రేమించుకున్నామని కానీ మా పెళ్లికి  పెద్దలు ఒప్పుకోవడంలేదని పోలీసులకు తెలిపారు. విషయం అర్థం చేసుకున్న  పోలీసులు వారిద్దరికీ స్టేషన్ లోనే పూల దండలు మార్పించి పెళ్లి చేసి పంపించేశారు.

Read  రాజధాని చుట్టుపక్కల భూ ప్రకంపనలు... ఇండ్ల నుండి పరుగులు తీసిన ప్రజలు...!

 గౌరి  తన భర్తను తీసుకుని ఇంటికి వచ్చేసరికి కుటుంసభ్యులు షాక్ అయ్యారు. గౌరీ పై కుటుంబ సభ్యులు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడినుండి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button