Tollywood news in telugu
ఆ హీరోయిన్ ఇస్టాగ్రామ్ ఎకౌంట్ హాక్ అయిందట….!

బాలీవుడ్ అగ్ర హీరోయిన్,రాజకీయ నాయకురాలు ఊర్మిళ మాటోండ్కర్ ఇస్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటూ…తన అభిమానులతో అభిప్రాయాలను అభిరుచులు పంచుకుంటూ ఉండేది…

కానీ ఈ నెల డిసెంబర్16 న ఊర్మిళ మాటోండ్కర్ ఇస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని.. తనే స్వయంగా తెలియజేసింది..ఈ మేరకు ఇస్టాగ్రామ్ సంబంధిత అధికారులను ఆశ్రయించింది.. అలాగే ఎకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్ల పై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రస్తుతం ఊర్మిళ సినిమాలకు విరామం ఇవ్వడంతో… రాజకీయాలకి రంగ ప్రవేశం చేసింది. మొదట 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడిపోయింది… ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి… శివసేన గూటికి చేరింది…
